HC on TDP Kilaru Rajesh Petition: టీడీపీ నేత కిలారు రాజేష్ పేరును సీఐడీ వెబ్సైట్లో పొరపాటున నిందితుడిగా పేర్కొన్నట్లు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టుకు నివేదించారు. ఆ పేరును తొలగించాలని అధికారులకు మౌఖికంగా సూచించానన్నారు. రాజేష్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యామమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి.. విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ నేత కిలారు రాజేష్‌ను సాక్షిగా హాజరుకావాలని సీఐడీ నోటీసులు జారీచేస్తూ.. మరోవైపు నిందితుడిగా పేర్కొంటూ లుక్ అవుట్ నోటీసులు జారీచేశారని పేర్కొంటూ కిలారు రాజేష్ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పలు దస్త్రాలను తమకు సమర్పించాలంటూ సీఐడీ సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద ఇచ్చిన నోటీసుతోపాటు హాజరుకావాలంటూ జారీచేసిన సెక్షన్ 160 నోటీసును రద్దు చేయాలని కోరారు.
HC Hearing on TDP Leader Kilaru Rajesh Petition: తనను విచారించేందుకు ఇంటిలిజెన్స్ డీజీ, మరికొందరిని అనుమతించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ కోరకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ, సీమెన్స్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
విచారణ నిమిత్తం ఈ ఏడాది అక్టోబర్ 16న సీఐడీ ముందు హాజరుకాగా.. మోహన్, సుదర్శన్ అనే వ్యక్తులు తన వ్యక్తిగత సమాచారం గురించి సుమారు 50 నిమిషాలు ప్రశ్నించారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు చెందినవారి గురించి అడిగారని తెలిపారు. మధ్యాహ్నం తర్వాత కూడా సుమారు 3.45 వరకు మళ్లీ ప్రశ్నించారన్నారు.
Kilaru Rajesh Petition on Skill Case: ఆ తర్వాత సీఐడీ డీఎస్పీ తనను విచారించారన్నారు. 'డీజీగారు నిన్ను రమ్మన్నారు' అని నాలుగు గంటల సమయంలో డీఎస్పీ తనకు చెప్పినట్లు తెలిపారు. దీంతో డీజీ ఛాంబర్‌కు వెళ్లగా.. ఇంటిలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి అక్కడ ఉన్నారన్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారని కోర్టుకు తెలిపారు.
TDP Leader Kilaru Rajesh Petition in HC: తనపై కేసు పెట్టడానికి తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని, తాము కోరిన విధంగా సహకరించడంలో విఫలమైతే.. ఉపేక్షించబోమని కేసు దర్యాప్తుతో సంబంధంలేని ఇంటిలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు హెచ్చరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసుకు సంబంధించిన వివరాల కోసం తనను లేదా రఘురామిరెడ్డిని కలవాలని చెప్పారన్నారు.
స్కిల్ కేసులో చంద్రబాబు ప్రధాన బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ
ఆ తర్వాత కాన్ఫరెన్స్ గదిలో వేచి ఉండాలన్నారని.. అక్కడ సెక్షన్160, 91 నోటీసులు ఇచ్చి, మరుసటి రోజు(17వ తేదీ) మళ్లీ హాజరుకావాలని చెప్పినట్లు కిలారు రాజేష్ తెలిపారు. మూడేళ్ల కిందటి దస్త్రాలను తీసుకురావాలని వారు కోరడంతో మరుసటి రోజు విచారణకు హాజరుకావడం సాధ్యంకాదని చెప్పానట్లు కోర్టుకు తెలిపారు.
తన అభ్యర్థనను తోసిపుచ్చి.. 17నే రావాలని తేల్చిచెప్పారని, దీంతో విచారణకు హాజరుకాలేక పోవడానికి కారణాలు పేర్కొంటూ రాతపూర్వకంగా సీఐడీ డీఎస్పీకి 17న సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరచకుండా అణచివేయడం కోసం, టీడీపీ కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారన్న ఉద్దేశంతో తనను వేధిస్తున్నారన్నారు. 'ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నోటీసులు ఇవ్వకుండా సీఐడీని నిలువరించండి' అని పిటిషన్లో కిలారు రాజేష్ కోరారు.
టీడీపీ నేత కిలారు రాజేశ్‌ను అనుసరించిన దుండగులు - ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు