ETV Bharat / state

ఫెట్​ కార్యక్రమంలో ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యాలు - Andhra Pradesh Latest News

FETE 2022 Program in Womens College: విజయవాడలోని దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫెట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల విద్యార్థినుల నృత్యాలు, చిన్నారుల వస్త్రధారణలు, వారు చెప్పిన సినిమా డైలాగ్‌లు చూపర్లను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల విద్యార్థినుల యాంకరింగ్‌ ప్రత్యేకంగా నిలిచింది. తమ విద్యార్థులకు చదువులతో పాటు బహుముఖ కార్యక్రమాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

FETE 2022 Program in Womens College
సిద్ధార్థ మహిళా కళాశాలలో ఘనంగా ఫెట్-2022
author img

By

Published : Dec 30, 2022, 10:37 PM IST

FETE 2022 Program in Womens College: విజయవాడలోని దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫెట్_2022 కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల విద్యార్థుల చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. చిన్నారుల వస్త్రధారణలు, వారు చెప్పే సినిమా డైలాగ్​లు చూపరులను ఆకట్టుకున్నాయి. తమ విద్యార్థులకు చదువులతో పాటు బహుముఖ కార్యక్రమాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి. విజయలక్ష్మీ తెలిపారు. సంవత్సరం పొడవునా విద్యార్థులకు చదువుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

తమ కళాశాలలో చదువుకునే విద్యార్థులు భవిష్యత్తులో వ్యాపారం, ఉద్యోగం నిమిత్తం వివిధ రంగాల్లో స్థిరపడుతుంటారు. అలాంటి సందర్భాల్లో వారికి ఎదురయ్యే ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన కల్పించడానికి ఫెట్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. తెలుగింటి అమ్మాయి, మిస్ సిద్ధార్థ వంటి కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులే యాంకరింగ్ చేశారు. అది మరో ఆకర్షణగా నిలిచింది.

సిద్ధార్థ మహిళా కళాశాలలో ఘనంగా ఫెట్-2022... ఆకట్టుకున్న నృత్యాలు, వస్త్రధారణలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.