Farmers Agitation in front of RBK : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచలలో రైతు భరోసా కేంద్రానికి అన్నదాతలు తాళాలు వేసి నిరసన తెలిపారు. కొద్దిరోజుగా ఆరోబీకేలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. ఎవరూ పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. కుంటిసాకులు చెప్తూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆర్బీకే సెంటర్కు తాళం వేసి.. దాని ఎదుటు బైఠాయించారు. రైతుల ఆందోళన సమాచారం తెలుసుకున్న ఆర్డీవో రవీంద్రరావు అక్కడికి చేరుకున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆర్బీకే సిబ్బందికి సూచించారు.
"నెల రోజుల నుంచి వరి కోతలు జరుగుతున్నాయి. పంట కోసిన వెంటనే గోనె సంచులను ఇవ్వటంలేదు. సంచులు ఉన్నా.. తూకం వేయటానికి మనుషులు ఉండటం లేదు. మనుషులు ఉంటే ధాన్యం తరలించటానికి వాహనాలు ఉండవు. మేము పంటకోసి ఆర్బీకే సెంటర్కు తీసుకువచ్చాము. గోనె సంచులు ఇవ్వమని అడిగితే.. సిబ్బంది లేవని అంటున్నారు." - కంచల గ్రామ రైతు
ఇవీ చదవండి :