ETV Bharat / state

పోలీసుల విచారణ, భూమి పోతుందన్న భయం.. రైతు ఆత్మహత్యాయత్నం - ap crime news

Farmer Suicide Attempt: భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఆ భూమి అతనిది కాదని.. దొంగ పత్రాలు సృష్టించాడని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా విచారించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రైతును విచారణకు పిలిచారు. పోలీసుల విచారణ, భూమి పోతుందన్న భయంతో రైతు ప్రాాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో జరిగింది.

Suicide Attempt
రైతు ఆత్మహత్య ప్రయత్నం
author img

By

Published : Mar 1, 2023, 6:07 PM IST

Farmer Suicide Attempt: తన భూమిని రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదనే మనస్థాపంతో ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన రైతు నందిపాం దానియేలు మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు దానియేలును చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నూజివీడు రహదారిలో 80 సెంట్ల పోరంబోకు భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దానియేలు రెవెన్యూ అధికారులకు ఇటీవల దరఖాస్తు చేశాడు. దరఖాస్తుతో పాటు జత చేసిన పాసుపుస్తకం, అడంగల్ నకిలీవని తహసీల్దార్ గుర్తించారు. అవి ఎక్కడనుంచి వచ్చాయని రెవెన్యూ అధికారులు ప్రశ్నించడంతో.. రాజకీయ నాయకులతో దానియేలు ఒత్తిడి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పాసుపుస్తకం వ్యవహారంపై విచారణ జరపాలని రెవెన్యూ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణకు పిలవడంతో పురుగుల మందు తాగి దానియేలు ఆత్మహత్యాయత్నం చేశాడు.

దానియేలుకు అసలు భూమి లేదని, ఈ-పాసుపుస్తకాలు జారీ చేస్తున్న సమయంలో అతని వద్ద మాన్యూల్ పాసుపుస్తకం ఉండటంతో నకిలీగా గుర్తించినట్లు రెవెన్యూ అధికారుల వెల్లడించారు. దానియేలు మాత్రం తనకు భూమి ఉందని, పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి రెవెన్యూ ఉద్యోగుల నుంచి పాసుపుస్తకం తీసుకున్నట్లు చెబుతున్నాడు. గత ముప్పై సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నట్లు దానియేలు వెల్లడించారు.

రైతు ఆత్మహత్య యత్నం

'నేను మా నాన్నా.. గత ముప్పై సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నాం. గతం నుంచి ఈ భూమిలో కాళ్లకు చెప్పులు లేకుండా నీరు పోసి మెుక్కలు పెచుకుంటున్నాం. భూమిపై హక్కు కోసం గత 15 సంవత్సరాలుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. గత కొంత కాలంగా మా కుటుంబసభ్యుల ఆనారోగ్యం కారణంగా ఆ వైపు వెళ్లలేదు. మా భూమిని కొందరు ఆక్రమించారు. ఇదే విషయమై ఎమ్మార్వోను అడిగాను. నా భూమి కోసం ఎమ్మార్వోని బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు నాకు న్యాయం చేయకపోగా... నాపై కేసు పెడతామంటున్నారు. నాకు రెండు సంవత్సరాల క్రితం వీఆర్ఏ రాంబాబు పాసుపుస్తకం ఇచ్చారు. అవి దొంగ పాసుపుస్తకం అంటున్నారు. ఇప్పుడు నా భూమి పోయింది. నా డబ్బులు పోయాయి. భూమి కోసం సర్వే చేయడానికి నేను పిలిచినప్పుడు రాని అధికారులు.. ఇప్పుడు వారి భూమి కోసం వచ్చారు. నేను కోర్టులో కేసు వేశాను. కోర్టులో కేసు ఉండగానే.. అనుబోలు బాజీ, అనుబోలు రాజారాం, అనుబోలు శ్రీరాంలు వారు నా భూమిలోకి వచ్చారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నేను సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి నన్నే కులం పేరుతో దూషిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నా భూమిని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.'- దానియేలు, బాధితుడు

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.