ETV Bharat / state

పేరుకే జగనన్న కాలనీలు.. కనీస వసతులు లేక లబ్ధిదారుల అవస్థలు - TDP Govt

Jagananna Colonies: పేరుకే జగనన్న కాలనీలు.. ఇళ్ల నిర్మాణాలు.. కాని కనీస మౌలిక వసతులు జగనన్న కాలనీల్లో కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్లు ఇస్తున్న ప్రాంతాలేమో ఊరికి దూరంగా ఉండడంతో కరెంట్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండట్లేదు.. ఇలా జగనన్న గృహ నిర్మాణ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది.

Mylavaram Jagananna Colonies
Mylavaram Jagananna Colonies
author img

By

Published : Feb 19, 2023, 8:13 PM IST

పేరుకే జగనన్న కాలనీలు.. కనీస వసతులు లేక లబ్ధిదారులకు అవస్థలు

Beneficiaries Suffering in Jagananna Colonies: ఎన్టీఆర్ జిల్లా మైలవరం సమీపంలోని పూరగుట్ట జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇళ్ల నిర్మాణానికి సరిపోవడం లేదని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న లక్షా ఎనబై వేల రూపాయలు ఇళ్ల పునాదుల నిర్మాణానికి సరిపోతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి సుమారు తొమ్మిది లక్షల వరకు ఖర్చు అవుతోందని అంటున్నారు. లబ్ధిదారుల వద్ద ఇంటి నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు. చేసిన అప్పు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు.

ప్రస్తుతం ఇస్తున్న లక్షా ఎనబై వేలు కాకుండా.. ఇంకా పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని.. దీంతో భయపడి అధికంగా అప్పులు చేసి ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పాలని కోరగా.. తమకు వచ్చే పథకాలు రాకుండా చేస్తారేమోనని వారు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతానికి నిర్మాణాలు పూర్తి చేసిన కొంతమంది గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం ఊరికి దూరంగా ఉండడంతో కరెంట్ సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించకపోవడంతో గృహ నిర్మాణదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతానికి రావడానికి నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.

సుమారు ఎనబై ఎకరాల్లో ఈ జగనన్న కాలనీ నిర్మిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇదే ప్రాంతంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన రెండు సెంట్ల స్థలాన్ని సెంటున్నారకు కుందించడంతో పాటు రోడ్ల వెడల్పు తగ్గించి ఇస్తున్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా మౌలిక వసతులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.