ETV Bharat / state

పోస్టింగ్​ దక్కని డీఎస్సీ-98 అభ్యర్థులలో ఉత్కంఠ.. 60ఏళ్లు దాటిన వారి సంగతేంటీ! - Etv bharat news

DSC : డీఎస్సీలో ఉత్తీర్ణులై పోస్టింగులు దక్కని అభ్యర్ధులలో.. రాష్ట్ర క్యాబినెట్​ నిర్ణయం వల్ల ఉత్కంఠ నెలకొంది. నియామకం ఏ ప్రకారం చేస్తారనే సందిగ్దంలో వారు ఉండిపోయారు. కొందరి అభ్యర్థుల వయస్సు 60 ఏళ్ల పైబడి ఉంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 10, 2023, 10:00 AM IST

  • DSC 98 : డీఎస్సీ-98లో ఉత్తీర్ణులై వివిధ కారణాలతో అప్పట్లో పోస్టింగులు దక్కని అభ్యర్థులను.. తాజాగా మినిమం టైం స్కేల్‌ విధానంలో నియమించుకోవడానికి రాష్ట్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలపింది. దీంతో సంబంధిత అభ్యర్థుల్లో నియామకాలు ఎలా చేపడతారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలను అధికారులతో పరిశీలన చేయించుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. విచారణకు వచ్చిన వారిలో కొందరు 60 ఏళ్ల పైన వారు ఉన్నారు. వీరు వయోపరిమితి దాటిపోయారని రాసుకున్నారు. విచారణ సమయంలోనే వారిని నిరుత్సాహానికి గురిచేయరాదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి పత్రాలు పరిశీలించి అక్‌నాలెడ్జిమెంట్‌ ఇచ్చారు.

ప్రకటించిన పోస్టుల కంటే రెట్టింపు అభ్యర్థులు : క్యాబినెట్‌ 4534 పోస్టులకు ఆమోదముద్ర వేసింది. అయితే అభ్యర్థులు మాత్రం ధ్రువపత్రాల విచారణకు 7500కు పైగా హాజరయ్యారు. ఒక్క ఉమ్మడి గుంటూరులోనే వెయ్యి మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల ప్రకారం చూస్తే గుంటూరుకు 400 పోస్టులకు మించి రాకపోవచ్చని విద్యాశాఖ వర్గాల సమాచారం. అభ్యర్థులు మాత్రం రెండు రెట్లు అధికంగా ఉన్నారు. ఇంచుమించు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరిని తీసుకోవాలంటే ఉన్న పోస్టులు సరిపోవని, అదనంగా కొన్ని సూపర్‌ న్యూమొరీ పోస్టులు సృష్టిస్తే తప్ప వారందరిని తీసుకోవటానికి వీలుపడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా ఈ నియామకాల్లో మెరిట్‌ కం రోస్టర్‌ విధానాన్ని పాటించాలని ఉన్నతాధికారులు మొగ్గుచూపినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు చాలా వరకు తగ్గిపోతారు. ఆపై 60 ఏళ్ల పైన వారు కొందరు అనర్హులవుతారు. ఇవన్నీ పోగా మిగిలిన పోస్టులకు సరిపడా అభ్యర్థులను తీసుకుంటారని, ఇలా చేస్తే సూపర్‌న్యూమొరీ పోస్టులు సృష్టించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. రోస్టర్‌కం మెరిట్‌ ప్రాతిపదికన నియామకాలు చేసుకోవడానికి ఉన్నత స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబరులో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ బదిలీలు నిర్వహించాలని, మూడేళ్లుగా బదిలీలు లేవని ప్రభుత్వం హడావుడి చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా క్లియర్‌ వెకెన్సీలు, ఒకే పాఠశాలలో 8 ఏళ్లకు పైగా చేస్తున్న వారి పోస్టులను ఖాళీలుగా చూపిస్తూ జిల్లాల వారీగా గుర్తించింది. ఆ మేరకు ఎంత మంది బదిలీకి అర్హులవుతారో, ఆ మేరకే ఖాళీ పోస్టులను కౌన్సెలింగ్‌ జాబితాలో ఉంచి మిగిలినవి బ్లాక్‌ చేశారు.

పోస్టింగ్​ ఎక్కడంటే : ప్రస్తుతం బ్లాక్‌ చేసిన ఖాళీల నుంచే వీరికి పోస్టింగ్‌లు ఇస్తారని అంటున్నారు. వీరికి కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగులు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో పలు డీఎస్సీల్లో మిగిలిపోయిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీలను క్యారిఫార్వార్డ్‌ ఖాళీలుగా గుర్తించి వాటిని తాజాగా డీఎస్సీ-98 అభ్యర్థులతో భర్తీ చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారని తెలిసింది. ఈ ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ అధికారులకు పంపారు. ఉమ్మడి గుంటూరులో ఈ ఖాళీలు వంద దాకా ఉన్నాయి. మరోవైపు సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు గతేడాది అక్టోబరులో పదోన్నతులు ఇచ్చారు. దీంతో సుమారు 400 ఎస్‌జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి, క్యారీఫార్వాడ్‌ ఖాళీలు కలిపి 500 వరకు ఉంటాయి. వీటిల్లోనే వారికి పోస్టింగ్‌లు ఇస్తారని అధికారులు చెబుతున్నారు. అత్యధిక ఖాళీలు పల్నాడు జిల్లాలో ఉండగా ఆ తర్వాత స్థానంలో బాపట్ల జిల్లా ఉంది. గుంటూరు జిల్లా నుంచి చాలా మంది పల్నాడు జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. సర్కారీ పాఠశాలల్లో సరిపడా పోస్టులు లేక ఇంకెవరైనా అభ్యర్థులు మిగిలితే వారిని బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలలు, వసతిగృహాల్లోనూ వారి సేవలను వినియోగించుకుంటారు. వీరంతా డీఎస్సీ పూర్తి చేసి రెండు దశాబ్దాలు గడిచిపోయింది. వీరిలో కొందరు మాత్రమే ప్రైవేటు స్కూళ్లల్లో పని చేస్తున్నారు. మరికొందరు ఉపాధ్యాయేతర ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో చాలా మంది సబ్జెక్టు మరిచిపోయి ఉంటారని, వారితో చదువు చెప్పించటం తమకు పెద్ద సవాలేనని ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.