ETV Bharat / state

టపాసులతో మోతమోగిన బెజవాడ- అనారోగ్య సమస్యలకు అవకాశమంటున్న నిపుణులు - PCB Statistics on Diwaali Pollution in Vijayawada

Diwaali Pollution in Vijayawada: దీపావళికి బెజవాడలో టపాసుల మోత మోగింది. పండుగ రోజు కాలుష్యం 30 నుంచి 40 శాతం పెరిగిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. పండుగ ముందు రోజు.. తర్వాత రోజుకు గణాంకాలు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్ ,నైట్రోజన్ ఆక్సైడ్​లు గాలిలో కలిసినట్లు పీసీబీ నమోదు చేసిన డేటాలో తేలింది. ఆరోగ్యానికి హాని జరిగే అవకాశాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

Diwaali_Pollution_in_Vijayawada
Diwaali_Pollution_in_Vijayawada
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 11:23 AM IST

Diwaali Pollution in Vijayawada: విజయవాడలో దీపావళికి నగరవాసులు టపాసుల మోతమోగించారు. పండుగ రోజు కాలుష్యం 30 నుంచి 40 శాతం పెరిగిందని.. పీసీబీ తాజా గణాంకాలు చెబుతున్నాయి. కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్​లు.. అధికశాతం గాలిలో కలిసినట్లు పీసీబీ డేటాలో తేలింది. శబ్ధ, వాయు కాలుష్యాన్ని వెదజల్లే హానికర ధూళి కణాల పరిమాణం గాలిలో అధికశాత నమోదయ్యాయని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

Diwali Celebrations in Vijayawada: ఏటా దీపావళికి ముందు, పండుగ నాడు కాలుష్య నియంత్రణ మండలి.. గాలి నాణ్యత, శబ్ధ తీవ్రతను కొలుస్తుంది. బెంజ్ సర్కిల్, ఐఎంఏ, యనమలకుదురులో ఈ ఏడాది గాలి నాణ్యత, శబ్ధ తీవ్రతను పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే గణాంకాలు అధికంగా పెరిగాయన్నారు. గాలి నాణ్యత తగ్గిందని.. ఈ గణాంకాలు ప్రమాద ఘంటికలకు సూచనలని పర్యారవణ శాస్త్రవేత్తలు తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

Air Pollution: దీపావళికి నగరవాసులు టపాసుల మోత మోగించారు. అధిక శబ్ధం, కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను తగ్గించుకోమని పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. తౌజండ్‌వాలా, ఫైవ్‌ తౌజండ్‌వాలా, లక్ష్మీ ఔట్లు, తదితర పెద్ద శబ్ధాలను వెలువరించే వాటిని ఎక్కువ మంది కాల్చారు. ఫలితంగా పండుగ నాడు గతేడాది కంటే ఎక్కువగా శబ్ధాలు నమోదయ్యాయి. గాలిలో ధూళి కణాల పరిమాణం బాగా పెరిగింది. గాలి నాణ్యత కూడా పడిపోయింది.

Diwali Crackers: పండుగ ముందు ఈనెల 6వ తేదీన, దీపావళి సందర్భంగా ఆదివారం శబ్ధ, వాయు కాలుష్యాన్ని పీసీబీ నమోదు చేసింది. పండుగ రోజు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పరిశీలించారు. పండుగ ముందు కన్నా.. దీపావళి రోజు కాలుష్య కారకాలైన సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు గాలిలో కలిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కించిన ఈ మూడు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి గతంతో పోలిస్తే.. 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. ఈ సూచి ఎంత పెరిగితే అంత గాలిలో స్వచ్ఛత తగ్గినట్లుగా పరిగణిస్తారు. అన్ని చోట్లా సల్ఫర్‌ డయాక్సైడ్‌ దాదాపు రెట్టింపు మోతాదులో గాలిలో కలిసింది. శబ్ధ తీవ్రత కూడా 9 శాతం మేర పెరిగింది. ఈ గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

రాష్ట్రంలో ఘనంగా దీపావళి సంబరాలు - నరకసురవధను అసక్తిగా తిలకించిన ప్రజలు

Air Pollution in Vijayawada: వాయుకాలుష్యం సైతం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శబ్ధం 30 నుంచి 60 డెసిబుల్స్‌ వరకు ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. గుండెపోటు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇంతకంటే దాటితే వినికిడి శక్తిపై అధిక ప్రభావం పడుతుంది. శబ్ధ కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ సమయం ఉంటే.. వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధాలు వింటే రక్తపోటు పెరగుతుంది. గుండెల్లో దడగా ఉంటుంది. ప్రతి 10 డెసిబుల్స్‌ ప్రభావం పెరిగే కొద్దీ ఆ శబ్ధం రెండు రెట్లు అధికంగా చెవికి వినిపిస్తుంది.

కేవలం మనుషులకే కాదు.. పక్షులు, జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. టపాసులు కాల్చడం వల్ల వెలువడే అధిక కాంతి, శబ్ధాల కారణంగా పక్షులు సురక్షిత ప్రాంతానికి తమ ఆవాసాల నుంచి భయంతో వెళ్లిపోతాయి. ఇవి తిరిగి వెనక్కి రావు. జీవ వైవిధ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది. ఊపరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దుమ్ము, ధూళి, రసాయన అవశేషాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది.

దీపావళి వేడుకల్లో జాగ్రత్త - ఈ తప్పులు అస్సలు చేయకండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.