Conflict Between Two Groups: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో శ్మశానవాటిక వద్ద రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన గుంతను మరో వర్గం ధ్వంసం చేసింది. అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అడ్డుకుంది. ఆగ్రహించిన మృతుడి బంధువులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి వాదనకు దిగారు. పెనుగంచిప్రోలు పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చదవండి: