ETV Bharat / state

చర్చి ఫాదర్​ ఆత్మహత్య..! వారే కారణమని బంధువుల ఆందోళన

Church Father Death: విజయవాడలోని ఓ చర్చి ఫాదర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకునే అంతా పిరికివాడు కాదనీ, ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలిసే వరకు పోస్టుమార్టం చేసేదే లేదని బంధువులు ఆసుపత్రి మార్చూరి వద్ద భీష్మించుకుని కూర్చున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 26, 2022, 10:11 PM IST

Church Father Death Case: విజయవాడ వన్​ టౌన్ ఆర్​సీయం చర్చికి చెందిన ఫాదర్ కొండ్రు రాజు (వెలంగిని రాజు) ఆత్మహత్య చేసుకోవడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన కొండ్రు రాజు వన్​ టౌన్ ఆర్​సీయం చర్చిలో ఫాదర్​గా వ్యవహరిస్తున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలను తెలిపే వరకు పోస్టుమార్టం చేయనివ్వమని బంధువులు, చర్చికి వచ్చే భక్తులు.. ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాసుపత్రి వద్ద జాతీయ రహదారిని 15 నిమిషాలు దిగ్బంధించారు.

చర్చి ఫాదర్​ ఆత్మహత్య చేసుకునే అంతా పిరికివాడు కాదనీ.. ఆయనను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. కొంతమంది ఫాదర్​ల చెప్పుచేతలలో ఆర్​సీయం వ్యవస్థ నడుస్తున్నదని ఆరోపించారు. దీనికి ఆర్​సీయం చర్చి పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. అంతేకాక ప్రభుత్వం కూలంకుషంగా విచారణ జరిపించి ఇతర ఫాదర్​లకు ఇలా జరుగకుండా ఉండలాని.. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.