ETV Bharat / state

రైతన్నను నిలువునా ముంచిన మిగ్‌జాం తుపాను - పంట నష్టం అంచనాలో సర్కారు తాత్సారం - ఏపీ రాజకీయ వార్తలు

Crop Loss Enumeration in AP: మిగ్​జాం తుపాను ప్రభావంతో పంటలు నీటమునిగిపోవటంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే పంట నష్టం అంచనా వేయటంలో ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తోంది.

Crop_Loss_Enumeration_in_AP
Crop_Loss_Enumeration_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 12:22 PM IST

Crop Loss Enumeration in AP: మొన్నటి వరకూ కరవు కాటు- ఇప్పుడు తుపాను పోటు రాష్ట్రంలోని రైతన్నను నిలువునా ముంచేశాయి. మిగ్​జాం తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న సహా ఉద్యాన పంటలైన అరటి, చెరకు, బొప్పాయి తోటలు కూడా ధ్వంసమయ్యాయి. ముందుగా నీట మునిగిన పొలాల నుంచి నీటిని తోడేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం మరో నాలుగు రోజుల తర్వాత పంట నష్టం అంచనా ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది.

రైతన్న ఇంట కన్నీరును మిగిల్చిన తుపాను - లక్షలాది ఎకరాలు వర్షార్పణం
మిగ్​జాం తుపాను సృష్టించిన విధ్వంసం రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లోని పంటల్ని తుడిచిపెట్టేసింది. దాదాపుగా 10 లక్షల ఎకరాల మేర పంటలు ఈదురుగాలులు, వర్షాలకు ధ్వంసమైనట్లు ప్రాథమిక అంచనా. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్యూమరేషన్ ప్రక్రియను మరో నాలుగు రోజుల తర్వాత ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ లోగా నీట మునిగిన పంట పొలాల నుంచి నీటిని పూర్తిగా తోడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

వరిచేల నుంచి నీటిని పూర్తిగా తోడిన అనంతరం కోత కోసిన పంట రంగు మారకుండా స్ప్రేయింగ్, అలాగే మొలకలు రాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాల్లోని వరి, మిర్చి వంటి పంటలు, అరటి, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

చెరువుకు గండికొట్టి పోలాల్లోకి నీటిని మళ్లించిన వైసీపీ సర్పంచ్ - అడ్డుకున్న రైతులపై దౌర్జన్యం

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కోత కోయని పంటను మాత్రమే నష్టం కింద గుర్తిస్తామన్నది వ్యవసాయ అధికారుల అభిప్రాయం. అయితే రాష్ట్రవ్యాప్తంగా మిగ్​జాం తుపాను సృష్టించిన విధ్వంసానికి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి.
సగటున ఒక్కో ఎకరానికి పెట్టుబడితో పాటు వ్యవసాయ ఉత్పత్తిని కూడా రైతు కోల్పోవాల్సి వస్తోంది.

ప్రతి రైతుకూ దాదాపు 40 వేల నుంచి 50 వేల రూపాయల మేర ప్రతి ఎకరాకూ నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మార్గదర్శకాలు, నిబంధనలంటూ మీనమేషాలు లెక్కిస్తుండటం, ఎన్యుమరేషన్ ప్రక్రియకు కూడా సమయం పట్టనుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి. ప్రత్యేకించి కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సీసీఆర్సీ కార్డులు లేని రైతులకు పెట్టుబడి, వ్యవసాయ ఉత్పత్తి నష్టపోవటంతో పాటు అప్పులనూ చెల్లించాల్సి ఉండటం పెనుభారంగా మారనుంది.

రైతన్న పుట్టిని మంచిన వైసీపీ సర్కార్? కేంద్రం బీమా పోర్టల్‌లో నమోదు కాని బీమా పంటల విస్తీర్ణం లెక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.