CPI Ramakrishna : దిల్లీలో ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి అర్జీలు ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్ ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం రావటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి అర్జీలపై కేంద్రం స్పందన ఏమిటో మీడియా సమావేశం నిర్వహించి.. వెల్లడించాలని అన్నారు. దిల్లీ పర్యటన అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలపై ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ.. పేదలకు మాత్రం వాటిని దూరం చేస్తున్నారని ఆరోపించారు.
లబ్దిదారులకు పింఛన్ నగదును పెంచిన ప్రభుత్వం.. పెన్షన్‌దారుల సంఖ్యను మాత్రం తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షాలది మంది రేషన్‌కార్డులలో కోత విధిస్తున్నారని ఆరోపణ చేశారు. ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు లబ్దిదారులను బెదిరింపులకు గురి చేస్తారా అని మండిపడ్డారు. సంక్రాంతి పండగ వరకైనా లబ్దిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్లను కేటాయించకోతే జనవరి 17వ తేదీ నుంచి జనవరి నెల వరకు ఆందోళనలు చేపడాతమని హెచ్చరించారు. అలాగే ఫిబ్రవరి 8నుంచి 14వ తేదీ వరకు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను సీపీఐ సందర్శిస్తుందని తెలిపారు.
"వివిధ ఆంశాలపై ముఖ్యమంత్రి.. ప్రదానిని, కేంద్ర మంత్రులను కలిసి అర్జీలు ఇచ్చారు. ప్రధాని మంత్రి స్పందించిన ఆంశాలను ముఖ్యమంత్రి ఏ పర్యటనలో వివరించటం లేదు. ఈ సారైనా మీడియా సమావేశం నిర్వహించి స్పష్టమైన ప్రకటన చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వ టిడ్కో ఇళ్లనూ పంపిణీ చేయాలి. వాటికి కేవలం రంగులు వేశారు. వాటి నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. వాటిని ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: