Amaravati Farmers: అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులపై అభ్యంతరాలు తెలిపిన రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు విజయవాడ వరకు ఎందుకు రప్పిస్తున్నారని రాజధాని రైతులు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్‌ను ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన రైతులు.. సీఆర్డీఏ కమిషనర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులకు ఇచ్చిన నోటీసులు సరైన పద్ధతిలో లేవని అన్నారు. రాజధానిలో ఐటీ పరిశ్రమల కోసం ఉద్దేశించిన జోన్‌ను మార్చడం వల్ల భావితరాల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని అమరావతి రైతులు భావిస్తున్నారు. ప్లాన్‌లో సవరణల ద్వారా అమరావతిని పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బృహత్ ప్రణాళికలో మార్పులపై అభ్యంతరాలు తెలిపిన రైతుల నుంచి అభిప్రాయాలను సీఆర్డీఏ అధికారులు వరుసగా ఏడో రోజూ తీసుకున్నారు.
ఇవీ చదవండి: