CM Jagan review on Global Investors Conference agreements: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో.. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. పరిశ్రమల శాఖలో ఎమ్మెఎస్ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్ అయ్యేలా ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో వివిధ పారిశ్రామిక సంస్ధలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల అమలుపై, ముఖ్యమంత్రి సమీక్షించారు. శాఖల వారీగా ఒప్పందాల స్థితిగతులపై ఆరా తీశారు. కార్యరూపంలోకి రాని.. ప్రతిపాదనలపైనా చర్చించారు. విశాఖ సదస్సులో 387 మొత్తం ఒప్పందాలు కుదుర్చుకున్నామని.. అధికారులు సీఎంకు వెల్లడించారు. వీటిలో పరిశ్రమలు,వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదరగా 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయన్నారు. జనవరి 2024 లోపు 38 కంపెనీల పనులు ప్రారంభం అవుతాయని సీఎం జగన్కు తెలిపారు. మార్చి 2024లోగా మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తి ప్రారంభిస్తాయని వివరించారు. 25 విద్యుత్ ప్రాజెక్టుల్లో 8 సంస్థల ప్రతిపాదనలు పెట్టుబడుల బోర్డు ఆమోదానికి పంపించామని తెలిపారు. మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు. 2024 నాటికి విశాఖ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశించారు.
Rs 10 lakhs compensation: రైలు ప్రమాద ఘటన.. ఏపీ మృతుల కుటుంబాలకు 10లక్షల పరిహారం
ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్స్ రంగంలో 88 ఒప్పందాలు చేసుకోగా, ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడంగానీ.... ఉత్పత్తికి సిద్ధం కావడం జరిగిందని అధికారులు సీఎంకు వివరిచారు. దాదాపుగా... 38 వేల573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని వెల్లడించారు. ఫుడ్ ప్రాససింగ్ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, వివిధ దేశాలకు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పారిశ్రామిక రంగ ప్రగతిలో కీలకమైన ఎమ్మెఎస్ఎంఈ లకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
పరిశ్రమల శాఖలో ఎమ్మెఎస్ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, దానికి ఒక కార్యదర్శిని నియమించాలన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్ కావాలన్న జగన్.. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల విశాఖనగర ఖ్యాతి పెరుగుతుందని సీఎం వెల్లడించారు. తద్వారా రాష్ట్రం ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని... అధికారులకు సూచించారు. 2021-22లో 11.43శాతంగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు. 2022-23లో 16.22 శాతానికి పెరిగిందని అధికారులు సీఎంకు వెల్లడించారు. జీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామికరంగం వాటా 23శాతానికి పెరిగి, దాదాపు రూ.13లక్షల కోట్లుగా ఉందని వివరించారు.