ETV Bharat / state

రిపబ్లిక్​ డే వేళ.. గవర్నర్​ ప్రసంగంలో పొరపాట్లు.. ఆరా తీసిన సీఎం జగన్​ - ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య

CM JAGAN ENQUIRY: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో దొర్లిన పొరపాట్ల పై జగన్‌ ఆరా తీశారు. CMOలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య, సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించి వివరణ కోరారు.

CM JAGAN ENQUIRY
CM JAGAN ENQUIRY
author img

By

Published : Jan 27, 2023, 7:36 AM IST

CM JAGAN ENQUIRY : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​ ప్రసంగంలో దొర్లిన కొన్ని పొరపాట్లపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య, సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని పిలిచి వివరణ కోరారు. గవర్నర్ ప్రసంగం అంతా నవరత్నాల పథకాల గురించి కావడంతో పాటు అందులో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబధించిన అంశాలపై పేర్కొన్న అంకెల విషయంలో తప్పిదం దొర్లినట్టు తెలుస్తోంది.

మరో వైపు పాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశామని గవర్నర్ ప్రసంగ పాఠంలో పేర్కొన్న ప్రభుత్వం.. అంతకు ముందు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగం గా 63 టీఎంసీల నీటిని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తామని గవర్నర్ ప్రసంగ పాఠంలోనే పేర్కొవడంపై విస్మయం వ్యక్తం అయినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.