ETV Bharat / state

Chandrababu Release TDP Workers Celebrations: జైలు గది నుంచి.. జనం గుండెల్లోకి చంద్రబాబు.. కట్టలు తెంచుకున్న అభిమానం.. ముందుగానే దీపావళి వేడుకలు - చంద్రబాబు విడుదలతో సంబరాలు

Chandrababu Release TDP Workers Celebrations: చంద్రబాబు విడుదలతో తెలుగుదేశం శ్రేణులు ముందే దీపావళి చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చిన నేతలు అభిమాన నేతపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

Chandrababu_Release_TDP_Workers_Celebrations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 9:35 AM IST

Updated : Nov 1, 2023, 10:34 AM IST

Chandrababu Release TDP Workers Celebrations: జైలు గది నుంచి.. జనం గుండెల్లోకి చంద్రబాబు.. కట్టలు తెంచుకున్న అభిమానం.. ముందుగానే దీపావళి వేడుకలు

Chandrababu Release TDP Workers Celebrations : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై (TDP Chief Chandrababu Interim Bail) విడుదల కావడం.. ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందర్లపాడులో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి.. మిఠాయిలు పంచారు. గుంటూరు ముత్యాలరెడ్డి నగర్​లో బాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ.. అమరావతి రైతులు తుళ్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. కృష్ణాయపాలెం శివాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. మందడంలో అమ్మవారికి పూజలు చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 116 టెంకాయలు కొట్టారు.

TDP Leaders Celebrations over CBN Interim Bail : పల్నాడు జిల్లా నరసరావుపేట NGO కాలనీలో మహిళలు అభయ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెయ్యి టెంకాయలు కొట్టారు. 500 మందికి అన్నదానం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చారు. గూడూరు లో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ లుంగీడాన్స్‌ చేశారు.

Chandrababu Followers Highly Crowd on Roads: జనసంద్రమైన రోడ్లు.. ఉప్పొంగిన అభిమానం.. ఎక్కడ చూసినా సంబరాలే..

Chandrababu Interim Bail in AP Skill Development Case : కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ వద్ద పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. నంద్యాల తెలుగుదేశం కార్యాలయం వద్ద పొలిట్ బ్యూరో సభ్యుడు ఫరూక్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చారు. నందికొట్కూరులో పార్టీ కార్యాలయం నుంచి పటేల్ కూడలి వరకు ర్యాలీ చేశారు.

CBN Interim Bail Celebrations : అనంతపురంలో మైత్రివనం సర్కిల్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి గుమ్మడికాయతో దిష్టి తీసి.. పాలాభిషేకం చేశారు. రాయదుర్గం వినాయక సర్కిల్ వద్ద స్వీట్లు పంచారు. సత్య సాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. కడప ఎన్టీఆర్ కూడలిలో డప్పులు వాయిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

నారావారిపల్లెలో సంబరాలు : తిరుపతిలో టీడీపీ, జనసేన నాయకులు సంబరాలు చేశారు. రేణిగుంట రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద పెద్దతెరలను ఏర్పాటు చేసి బాబు విడుదల సన్నివేశాలను ప్రదర్శించారు. 2024లో జగనాసుర చతుర్ధశి తప్పదన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు బాణాసంచా కాల్చారు. స్వీట్స్ పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగంపేట ప్రధాన కూడలిలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.

Chandrababu Released from Rajahmundry Central Jail: రాజమండ్రి తరలివచ్చిన అభిమాన జనతరంగం.. చంద్రబాబును చూసి ఆనందపారవశ్యం

సీబీఎన్ మహిళా సైన్యం ఆధ్వర్యంలో నృత్యాలు : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో బేబి నాయన డప్పు కొట్టి నృత్యాలు చేశారు. పార్వతీపురం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. నాగవంశ వీధి కూడలి వద్ద గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. విశాఖ సిరిపురం కూడలి వద్ద CBN మహిళా సైన్యం ఆధ్వర్యంలో నృత్యాలు చేశారు.అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో.. మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద నాయకులు బాణాసంచా కాల్చారు.

బెంగళూరులో సంబరాలు : బెంగళూరులో ఐటి ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు. మారతహళ్ళిలో తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కోసి టపాకాయలు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

Last Updated : Nov 1, 2023, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.