Chandrababu Lashes out at CM Jagan Mohan Reddy: రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మన రాతలు తిరగరాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాలి, లేదంటే వదిలి పారిపోయే ఖర్మ ప్రజలకేంటని మండిపడ్డారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు - జగన్‌కు తన సినిమా అయిపోయిందని అర్ధమైందని, వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్‌ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ట్వీట్ పెడితే వేధింపులు: ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో నాలుగున్నర సంవత్సరాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి సీఎంగా పనికిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ పెడితే వేధింపులు, ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసులకు భయపడి బయటకు రాకుంటే ప్రజలకే నష్టం జరుగుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మంత్రుల పర్యటనకయ్యే ఖర్చుల కోసమే లంచాలు - తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు
విశాఖలో 40వేల కోట్ల భూ కబ్జాలు: విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌ను వైసీపీ నేతలు అడిగారని, ఆ ప్యాలెస్ ఇవ్వనందుకే ప్రభుత్వ భూమిలో ఉందంటూ 22-ఏ కింద ఉందని ఆ ప్యాలెస్ యజమానిని వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలోనే 40వేల కోట్ల భూ కబ్జాలు జరిగాయని, ఆ భూ దందాలన్నీ 22ఏ నిబంధన ఉల్లంఘించే జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఒకప్పుడు రొయ్యి మాదిరి మీసాలు మెలేసిన ఆక్వా రైతులు ఇప్పుడు పూర్తిగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఆక్వా రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే, వైసీపీ పాలనలో ఆక్వా రైతులు బాగా నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యనిషేధం చేయకపోతే ఓటే అడగనన్న జగన్ నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రేపు బలవంతంగా మద్యాన్ని తాగిస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే జగన్ కు బినామీ గా 2జిల్లాల్లో ఇసుక కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసేసిన ఇసుక మాఫియా వైసీపీదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే యజ్ఞాలు, హోమాలు పూజలు చేశానని, తన కోసం కాదని వెల్లడించారు.
వైఎస్ కోసం ఆయన కుటుంబం ఏం చేసింది ? : ఆనం వెంకట రమణా రెడ్డి
ఉచిత బస్సు ప్రయాణం హామీని కాపీ కొట్టి జగన్: ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాపీ కొట్టి జగన్ అమలు చేస్తానంటున్నాడని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన నిత్యావసరాలు, అధిక బిల్లులు, ధరలు రూపేణా దోచింది తిరిగి ఇస్తాడా అని నిలదీశారు. రాబోయే మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తాడా అని ప్రశ్నించారు. కోర్టులు చివాట్లు పెట్టినా సిగ్గుపడట్లేదని మండిపడ్డారు. రేపు జరిగే ఎన్నికలు 5కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మధ్య అని చెప్పారు. జగన్ లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరోధక చర్యలు లేవని గుర్తు చేశారు.
చంద్రబాబు-ప్రశాంత్ కిషోర్ భేటీపై వైసీపీ నేతలు విమర్శలు - గట్టిగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు