ETV Bharat / state

గోల్డెన్​ గ్లోబ్స్​లో "ఆర్​ఆర్​ఆర్"​ సంచలనం .. చిత్రబృందానికి అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు - Golden Globe award winners RRR 2023

Wishes to RRR Team: ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు ప్రఖ్యాత గోల్డెన్​ గ్లోబ్ అవార్డు రావడంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. చిత్రబృందానికి తన శుభాభినందనలు తెలియజేశారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకోవటం గర్వకారణమన్నారు

wishes to RRR team
ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ప్రముఖుల శుభాకాంక్షలు
author img

By

Published : Jan 11, 2023, 10:50 AM IST

Updated : Jan 11, 2023, 2:45 PM IST

Wishes to RRR Team: ‌ఆర్ఆర్ఆర్ సినిమా విశిష్ట పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవటం గర్వకారణమని అభినందించారు. కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రబృందానికి తన శుభాభినందనలు తెలిపారు. తాను గతంలో చెప్పినట్లు తెలుగు భాష భారతీయ సాఫ్ట్ పవర్​గా మారుతోందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Jagan Mohan Reddy: ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి, కీరవాణికి ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలియజేశారు. విశ్వ యవనికపై తెలుగు పతాకం సగర్వంగా ఎగిరిందని కొనియాడారు. మీ అద్భుత విజయానికి గర్వపడుతున్నాం అని అన్నారు.

Venakaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అభినందనలు తెలిపారు.

  • ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని "నాటు.. నాటు.." గీతానికి ప్రపంచ ఖ్యాతి దక్కటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ గీతానికి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి సహా ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను @RRRMovie https://t.co/VPyzVewVIH

    — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pawan Kalyan: 'ఆర్ఆర్ఆర్' సినిమా పాటకు 'గోల్డెన్ గ్లోబ్' రావడం సంతోషదాయకమని పవన్ కల్యాణ్‌ కొనియాడారు. అవార్డు రావడం భారతీయులందరూ సంతోషించదగ్గ విషయమని అన్నారు. పాటకు స్వరకల్పన చేసిన కీరవాణికి అభినందనలు తెలిపారు.చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు అభినందనలు తెలియజేశారు. తెలుగు పాట కీర్తిప్రతిష్టలను అవార్డు ఇనుమడింపచేస్తుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ అవార్డు పొందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

Nara Lokesh: ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.