JD Laxmi Narayana In Bankers Meet : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయనున్నట్లు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఒకవేళ పార్టీలతో కుదరకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని తెలిపారు. విజయవాడలో బ్యాంకులు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాజధాని విషయంలో... అసెంబ్లీలో మొదట ఆమోదించిన దానికి అందరూ కట్టుబడి ఉండాలని.. అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు.
ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగులు, నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచే పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సహా విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని, వీటన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టిన పార్టీతో నడుస్తానన్నారు. తన ఆశయాలకు సరిపోకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు.
నేను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకూడదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, రైల్వే జోన్ అనేది తీసుకు రావాలి. ఏ పార్టీలైతే ఈ విధమైన ఆలోచనల ధారతో ఉన్నయో వారితో నేను చర్చించడానికి సిద్దంగా ఉంటాను. అది సాధ్యం కాకుంటే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయడానికి కూడా అవకాశం ఇస్తుంది మన వ్యవస్థ. అసెంబ్లీ సాక్షిగా మనందరం నిర్ణయించుకున్న రాజధాని అమరావతి రాజధాని... కాని ఇప్పుడు దాన్ని మార్చేసి మనం వేరేచోటి పెట్టడం అనేది సబబు కాదు. -సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
రైతులకు ప్రయోజనం చేకూర్చడం సహా బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఎఐబీఐఎ జనరల్ సెక్రటరీ రాంబాబు తెలిపారు.
ఇవీ చదవండి :