ETV Bharat / state

NDA invitation to Pawan: ఎన్డీఏ సమావేశానికి పవన్​కు ఆహ్వానం.. రేపు దిల్లీకి

BJP leadership invited Pawan Kalyan to the NDA meeting: ఎన్డీయే సమావేశానికి హాజరుకావాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ అధిష్ఠానం ఆహ్వానం పలికింది. ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన పవన్ కల్యాణ్ దిల్లీకి బయలుదేరి, 18వ తేదీన జరగనున్న సమావేశంలో పాల్గొంటారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది.

NDA
NDA
author img

By

Published : Jul 15, 2023, 10:58 PM IST

Updated : Jul 16, 2023, 11:38 AM IST

BJP leadership invited Pawan Kalyan to the NDA meeting: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జులై 18వ తేదీన దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు బీజేపీ అధిష్ఠానం ఆహ్వానం పలికింది. పవన్ కల్యాణ్‌తోపాటు ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలను కూడా బీజేపీ ఆహ్వానించనుంది. ఈ తరుణంలో ఈ నెల 17వ తేదీన పవన్ కల్యాణ్ దిల్లీకి బయలుదేరి, 18వ తేదీన జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనున్నారని జనసేన పార్టీ అధిష్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది.

జులై 18న దిల్లీలో ఎన్డీఏ సమావేశం.. భారతీయ పార్టీ ఆధ్వర్యంలో జులై 18వ తేదీన దేశ రాజధాని దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. ప్రస్తుతానికి జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 17వ తేదీన జనాసేనాని దిల్లీకి పయనం.. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 18న దిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రానికి దిల్లీ చేరుకుని..18వ తేదీన సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొనున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంపై ఏదైనా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.

దిగ్విజయంగా వారాహి యాత్ర.. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ పర్యటనను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. తాజాగా 2వ దశ పర్యటనను ఏలూరు జిల్లాల్లో ప్రారంభించారు. ఇటీవలే తాడేపల్లిగూడెంలో, గతరాత్రి తణుకులో పర్యటించిన పవన్.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, వైఎస్సార్సీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.

Last Updated : Jul 16, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.