BJP Leaders in Mann Ki Baat: జాతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ.. చిన్న విషయాలు సైతం సమాజంలో పెద్ద మార్పు తీసుకొస్తుందనే విశ్వాసంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా మనసులో మాట కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ తెలిపారు.
విజయవాడ సిద్ధార్ధ మహిళా కళాశాలలో విద్యార్ధినులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 100వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, పార్టీ నేతలు లంకా దినకర్, కిలారి దిలీప్ తదితరులతో కలిసి సత్యకుమార్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకునిగా నరేంద్రమోదీ అందరి దృష్టిని ఆకర్షించినా - తనకున్న సమయంలో నెలకు ఓ గంట సేపు విభిన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు వారిని ఆలోచింపజేసేందుకు చేస్తోన్న ప్రయత్నం స్ఫూర్తిదాయకమన్నారు.
ఇలాంటివి జాతి నిర్మాణానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఓ వైపు అభ్యుదయం గురించి మాట్లాడుతూనే మన దేశ ఉత్కృష్టమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనేక కొత్త ఆవిష్కరణల గురించి ప్రజలకు వివరిస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే ఏ దేశంతోనూ మన యువత మేథోసంపత్తిలో తీసిపోరని చాటుతూ - యువతను జాగృతులను చేస్తున్నారని అన్నారు.
"ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికీ.. అనేక విషయాల మీద ఆయన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఒక వైపు స్పేస్ రీసెర్చ్ మీద మాట్లాడటం, లేదా కొత్త కొత్త టెక్నాలజీల మీద మాట్లాడటం, లేదా అధునాతనమైన వైద్య సౌకర్యాల గురించి మాట్లాడుతూ.. రెండో వైపు చిన్న చిన్న గ్రామాలలో ప్రజల జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తారు.
ఒక కుగ్రామంలో ప్రజలంతా కలసి చెరువుని పునర్నిర్మించుకోవడం, లేదా ఒక మహిళ తాను చనిపోయిన తరువాత అవయవదానం చేసి నలుగురికి ప్రాణాలు ఇవ్వడం గురించి, ఒక యువకుడు తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. వ్యవసాయంలో నవీన పద్ధతుల్ని అలవర్చుకొని, ఉత్పాదనను పెంచి.. నలుగురికి దారి చూపడం వంటివి ప్రస్తావించారు.
అదే విధంగా కుమార్తె ప్రాముఖ్యత గురించి, కుమర్తెను సంరక్షించుకోవడం గురించి చెప్పారు. ఇలా అనేక విషయాలపై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణపై, జాతి సమైక్యతపై, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి కూడా ఈ వంద ఎపిసోడ్స్‌లలో మాట్లాడారు. జాతి నిర్మాణంలో పెద్ద పెద్ద విషయాలే కాదు చిన్నచిన్నవి కూడా మార్పులు తీసుకొస్తాయని వారు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు". - వై. సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి
ఇవీ చదవండి: