Bharat Mata Temple in Vijayawada: భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. వివిధ మతాలు, జాతులు, కులాలు, భాషలతో ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును భారత్ తెచ్చుకుంది. దీన్ని మరింత పెంపొందించేలా విజయవాడలో భరతమాతకు ఆలయం నిర్మించారు. ఇక్కడ మిగతా దేవుళ్ల మాదిరిగానే పూజాదికాలు, అన్న సంతర్పణలు జరుగుతున్నాయి. దైవభక్తితో పాటు దేశభక్తిని ప్రజల్లో పెంపొందించేందుకే భరతమాత విగ్రహాన్ని ఏర్పాట చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
విజయవాడ నందమూరి నగర్‌లో 2008లో భరతమాతకు దేవాలయం నిర్మించారు. ఐదడుగుల పాలరాతితో భరతమాత విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. మువ్వన్నెల జెండాను చేతబట్టి భరతమాత పూజలందుకుంటోంది. మిగతా దేవుళ్లు, దేవతల మాదిరిగానే ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భరతమాత పేరిట అష్టోత్తర నామావళిని జపిస్తున్నారు. గత ఏడాది ప్రార్థనా గాన సంఘం ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో పూజలు, భగవన్నామ సంకీర్తనలు, భగవద్గీత పారాయణం, సత్సంగాల ద్వారా ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని పెంపొందించేలా సంఘ సభ్యులు తమ వంతు కృషి చేస్తున్నారు.
అఖండ భారత ఐక్యతా హారతిగా.. భారతమాత మందిరం
Freedom Fighters Photos: ప్రతి పౌర్ణమికి లలితా సహస్ర పారాయణంతో పాటు వందలమందికి అన్నసంతర్పణ నిర్వహిస్తున్నారు. దేశంలో భరతమాత పేరిట ఆలయాలు అరుదైన విషయమనే చెప్పాలి. సంఘ సభ్యులు కొందరు హరిద్వార్‌లోని భరతమాత ఆలయాన్ని చూసి.. ఆ ప్రేరణతో విజయవాడలో భరతమాతకు ఆలయానికి శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఎటు చూసినా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల చిత్రాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో కుల, మత, ప్రాంతీయకు అతీతంగా అంతా ఒక్కటే అన్న భావనను పెంపొందిస్తున్నారు. అందరి దేవుళ్ల ఏకాత్మరూపమే భరతమాత ప్రతిరూపమని ప్రార్థన గాన సంఘం సభ్యులు చెబుతున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. విజయవాడలోని భరతమాత ఆలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
"మనమందరం ఒకటే అనే ఆలోచన రావాలి. ప్రతిచోట భారతమాత విగ్రహలు పెట్టాలి. అందరి దేవతలున్నారు. అందరి దేవతలకు నమస్కరిస్తాం. మనమందరం ఒకటే అనే భావన రావటానికి ఇక్కడ భారతమాత విగ్రహన్ని ప్రతిష్ఠ చేసి పూజాధికాలు ఏర్పాటు చేశాము." -లక్ష్మణరావు, భరతమాత ఆలయ వ్యవస్థాపకుడు
ఇంట్లోనే తల్లికి గుడి కట్టిన కూతుళ్లు.. టిఫిన్ నుంచి భోజనం వరకు..
"భారతీయులంతా ఒకటేనని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో.. కుల మత విచక్షణ లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఏర్పాటు చేశాము. ఏ కులం, మతం అనేది చూడము." -శివరామకృష్ణ, ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు
భారత మాత మందిరంలో ప్రతి నెల పౌర్ణమి రోజు కుంకుమ పూజలు చేస్తారు. ఈ ప్రాంతంలోని మహిళలు ఇక్కడికి వచ్చి.. పూజలు చేస్తారు. ఆ తర్వాత సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు."-భారతి, నందమూరి నగర్
Lokesh: 'భరతమాత విగ్రహాన్ని తొలగించటం నిరంకుశత్వానికి నిదర్శనం'