ETV Bharat / state

సీఎం జగన్‌తో బాలినేని భేటీ - ఆరోపణలపై సిట్ సమగ్ర విచారణ జరిపించండి

Baline Met With CM Jagan: వైసీపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మరోసారి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, భూ అక్రమాల్లో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్ సమగ్ర విచారణ జరపాలని సీఎంను కోరారు.

Balineni_Came_to_the_CM_Camp_Office
Balineni_Came_to_the_CM_Camp_Office
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 7:28 PM IST

Updated : Nov 2, 2023, 7:46 PM IST

Baline met with CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన మంత్రి పదవి కోల్పోయిన నాటి నుంచి ఈరోజు దాకా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో చర్చించిన బాలినేని.. గురువారం మరోసారి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు.

సీఎం జగన్‌తో బాలినేని భేటీ- ఆరోపణలపై సిట్ సమగ్ర విచారణ జరిపించండి

Balineni Came to the CM Camp Office: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్‌ని కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఒంగోలు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై, పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులపై మరోసారి సీఎంతో చర్చించారు. భూ అక్రమాల్లో తనపై వచ్చిన ఆరోపణలపై బాలినేని వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్ సమగ్ర విచారణ జరపాలని, భూ అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని బాలినేని కోరారు. దాంతోపాటు పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తెచ్చారు. తనపై వైవీ సుబ్బారెడ్డి కుట్రలు చేస్తున్నారని గతంలోనే సీఎంవో అధికారికి బాలినేని ఫిర్యాదు చేసిన విషయాన్ని, ఇటీవల సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డికి ఫిర్యాదు చేసిన విషయాన్ని సీఎం జగన్‌కు గుర్తు చేశారు.

Balineni met CM Jagan: పార్టీలో ఇబ్బందులపై సీఎంతో చర్చించా: మాజీ మంత్రి బాలినేని

Balineni Resigned YCP Coordinator: పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎప్పుడూ పని చేస్తుండే తనపై.. కొంత మంది లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తూ పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో సీఎం జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. తన అసంతృప్తికి గల కారణాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనపై చేస్తున్న కుట్రలను సీఎంకు వివరించారు.

Balineni Letter to DGP: 'నాలుగేళ్లుగా దారుణాలు చూస్తున్నా'.. పోలీసుల తీరుకు నిరసనగా గన్​మెన్లను సరెండర్ చేస్తున్నట్లు బాలినేని లేఖ

Balineni Letter to State DGP: ఈ నేపథ్యంలో ఇటీవలే ఒంగోలు జిల్లాలో నకిలీ భూపత్రాల వ్యవహారం కలకలం రేపింది. దాంతో ఆ వ్యవహారంలో ఎంతటి వారున్నా అరెస్టు చేయాలని, అధికార పార్టీ నేతలున్నా వదిలిపెట్టకూడదంటూ.. రాష్ట్ర డీజీపీకి బాలినేని లేఖ రాశారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో.. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. రెండు వారాల క్రితమే సీఎంవో ఆఫీసుకి విచ్చేసి..కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఎవరైనా నాపై లేనిపోనివి మాట్లాడితే నేను సహించను. నేను ఒకరి గురించి తప్పుగా మాట్లాడాను..నా గురించి మాట్లాడితే ఊరుకోను.నేను ఏమైనా తప్పు చేశానో చెప్పండి వాటికి ఓకే. కానీ, లేనివి మాట్లాడటం కరెక్ట్ కాదు. మళ్లీ చెప్తున్నా.. నా గురించి మా పార్టీ వాళ్లు గానీ, వేరే పార్టీవాళ్లు గానీ తప్పుగా మాట్లాడితే ఊరుకోను. - బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి

SP Malika Garg on Land Scam Case: నకిలీ స్టాంప్‌ల కేసు సిట్ ద్వారానే దర్యాప్తు జరుగుతోంది.. సీఐడీ ప్రస్తావన లేదు: ఎస్పీ మలికాగార్గ్‌

Last Updated : Nov 2, 2023, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.