Chintakayala Ayyanna Patrudu : ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. జగన్‌పై చర్యలు తీసుకునే ధైర్యం మోదీకి లేదా అని నిలదీశారు. భాజపాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్‌ని నిలదీయాలని సూచించారు. బుద్దా వెంకన్న దీక్షకు మద్ధతు తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని అయ్యన్న అన్నారు. అయితే ఉత్తరాంధ్ర సమస్యలపై తెదేపా పోరుకు విశాఖ వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన విజయవాడలోని ఇంట్లోనే దీక్ష చేపట్టారు.
ఇవీ చదవండి: