ETV Bharat / state

ఆర్టీసీ 'డోర్ టు డోర్' కార్గో సర్వీస్.. వాళ్లకు బంపరాఫర్​ - ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ వార్తలు

APSRTC DOOR TO DOOR CARGO SERVICE: ఏపీఎస్​ఆర్టీసీ తన సేవలను మరింత విస్తరిస్తోంది. వినియోగదారుడి ఇంటికి వెళ్లి పార్శిల్ తీసుకురావడం.. డెలివరీ చేయడం కోసం 'డోర్ టు డోర్' కార్గో సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు తొలి 3 ఆర్డర్లకు కార్గో.. పికప్ అండ్ డెలివరీ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు. రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ విజయవాడలో ఈ సేవలను ప్రారంభించారు.

APSRTC DOOR TO DOOR CARGO SERVICE
ఆర్టీసీ డోర్ టు డోర్ కార్గో సర్వీస్
author img

By

Published : Mar 20, 2023, 10:49 PM IST

APSRTC DOOR TO DOOR CARGO SERVICE: సరకు రవాణా సేవలను సమర్థంగా నిర్వహిస్తోన్న ఆర్టీసీ వినియోగదారుల సదుపాయం కోసం సేవలను మరింత విస్తరించింది. వినియోగదారుడి ఇంటికి వెళ్లి పార్శిల్ తీసుకురావడం, డెలివరీ చేయడం కోసం డోర్ టు డోర్ సర్వీసు ప్రారంభించింది. రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ విజయవాడలో సేవలను ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న మంత్రి.. డోర్ టు డోర్ కార్గో సర్వీస్​ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సరకు రవాణా ద్వారా రూ.500 కోట్ల ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యమన్నారు. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వం లోన్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. పార్శిల్ సర్వీసును తొలుత విజయవాడ, విశాఖపట్నం మధ్య తొలుత డోర్ టు డోర్ కార్గో సేవలు ప్రారంభిస్తున్నామని, తదుపరి రాబోయే రోజుల్లో డోర్ టు డోర్ కార్గో సేవలు రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు. తక్కువ ధరలో మెరుగైన విధానంలో కార్గో సేవలు అందిస్తామని, ప్రజలంతా ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఉగాది పండుగ రోజు నుంచీ డోర్ టు డోర్ సర్వీసు అందుబాటులోకి తెస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆన్​లైన్ లేదా యాప్ ద్వారా కార్గో సేవలు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రారంభం సందర్భంగా వినియోగదారులకు తొలి 3 ఆర్డర్లకు కార్గో.. పికప్ అండ్ డెలివరీ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.

ఆర్టీసీ డోర్ టు డోర్ కార్గో సర్వీస్.. ఫస్ట్ 3 ఆర్డర్లకు పికప్, డెలివరీ సేవలు ఉచితం

"వినియోగదారులు కౌంటర్​కు వచ్చి బుక్ చేసుకోవలసిన అవసరం లేకుండా.. వాళ్లు ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు. ఉగాది రోజు నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి ట్రయల్​ రన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ డోర్ డెలివరీ అనేది రెండు ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. ప్రారంభ కానుకగా.. మొదటి మూడు ఆర్డర్లు.. పికప్ అండ్ డెలివరీ ఫ్రీగా చేస్తున్నాం". - ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ

"ఈ రోజు ఆర్టీసీ ప్రజలు మనసు గెలుచుకోవడానికి మరో అడుగు మందుకు వేస్తుంది. ఉగాది రోజు నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయి. 50 కేజీల బరువు.. 20 కిలోమీటర్ల దూరం వరకూ.. డెలివరీ ఛార్జీలు ఏమీ లేకుండా.. ఉచితంగా అందిస్తున్నాం. ప్రజల లగేజీకి మేము హామీ ఇస్తున్నాం. మీ సామానులను భద్రత మాది. ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం". - పినిపే విశ్వరూప్, రవాణాశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.