ETV Bharat / state

ముగిసిన గ్రూప్​-1 ప్రిలిమ్స్​.. సెల్​ఫోన్​తో పట్టుబడ్డ అభ్యర్థి - ఏపీలో పోటీ పరీక్షలు

APPSC : రాష్ట్రంలో గ్రూప్​-1 ప్రిలిమ్స్​ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్ 1.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. విజయవాడలో గ్రూప్ 1 పరీక్షా కేంద్రంలో బెంజిసర్కిల్​లోని నారాయణ కళాశాల పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి కాపీయింగ్ చేసిన ఘటన వెలుగు చూసింది.

Prelims
గ్రూప్​1 ప్రిలిమ్స్​
author img

By

Published : Jan 8, 2023, 5:45 PM IST

Updated : Jan 8, 2023, 6:01 PM IST

APPSC Group 1 exam : ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకో సం ఎపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఎపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు.

విజయవాడలో బెంజిసర్కిల్​లోని నారాయణ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ వెలుగు చూసింది. ఉదయం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న కొల్లూరు వెంకటేష్ అనే అభ్యర్ధి ఏకంగా మొబైల్ తీసుకువచ్చారు. మొబైల్​లో గూగుల్ ఓపెన్ చేసి జవాబులు రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంకటేష్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈసారి పేపర్ 1 పరీక్ష తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదివి అర్ధం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం అభ్యర్థుల సత్తా పరీక్షించేందుకు ఎక్కువ నిడివి గల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తర్జుమాలో తికమక పెట్టిందని పలువురు తెలిపారు. గుగూల్​తో తర్జుమా చేశారని, దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్థులు నష్టపోయే పరిస్ధితి వచ్చిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఎక్కువగానే ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. సివిల్స్ పరీక్ష నిర్వహించే స్థాయిలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని పలువురు నిరాశ వ్యక్తం చేశారు. ప్రశ్నలు కటువుగా ఉండటం వల్ల ఎక్కవ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయినట్లు తెలిపారు. అక్షరదోషాలు, సమాధానం లేని ప్రశ్నలు, తికమక పెట్టే ప్రశ్నలు లేవని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 8, 2023, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.