ETV Bharat / state

బీఆర్​ఎస్​ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ - మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు

chandrasekhar
brs ap president
author img

By

Published : Jan 2, 2023, 8:35 PM IST

Updated : Jan 2, 2023, 10:07 PM IST

20:18 January 02

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

AP Leaders joined in BRS: ఆంధ్రప్రదేశ్​కు చెందిన పలువురు నేతలు భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి తదితరులు పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ అధిష్ఠానం ఏపీ సహా వివిధ రాష్ట్రాల నాయకులతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్‌, కిశోర్‌బాబు, పార్థసారథి తదితరులు పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు.

బీఆర్​ఎస్​ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్​ను కేసీఆర్​ ప్రకటించారు. చంద్రశేఖర్​ మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. రావెల కిషోర్ బాబు సేవలను జాతీయ స్ఠాయిలో వినియోగించుకుంటామని కేసీఆర్​ తెలిపారు. ఏపీలో సిట్టింగ్ అభ్యర్థులు కూడా బీఆర్​ఎస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్​ వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.