ETV Bharat / state

AP Higher Education Counseling ఉన్నత విద్యామండలికి నిర్లక్ష్య వైఖరి ఎలా? విద్యార్థులకు పరీక్షా కాలం..!

author img

By

Published : Aug 19, 2023, 8:32 AM IST

Counseling process in higher education: ఉన్నత విద్యపై సీఎం జగన్‌, ప్రభుత్వం చేస్తున్న ఆర్భాట ప్రకటనలకు.. వారి చేతలకు పొంతనే కుదరడం లేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తుపై దుష్ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ఎకడమిక్‌ క్యాలెండర్‌ ఇస్తున్నా... పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలను సకాలంలో పూర్తిచేయడంలేదు. ఆగస్టు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఐసెట్‌, పీజీ(PG).సెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈ సెట్‌, పీజీఈ.సెట్‌, ఆర్-సెట్‌ వంటి పరీక్షలు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి.

Counseling process in higher education
Counseling process in higher education

Counseling process in higher education: విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ఎకడమిక్‌ క్యాలెండర్‌ ఇస్తున్నా... పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలను సకాలంలో పూర్తిచేయడంలేదు. ఆగస్టు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఐసెట్‌, పీజీ(PG).సెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈ సెట్‌, పీజీఈ.సెట్‌, ఆర్-సెట్‌ వంటి పరీక్షలు పూర్తికాలేదు. ఎంటెక్‌, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహించే పీజీఈసెట్‌లో.. గేట్‌, జీ-ప్యాట్‌ వారికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారికి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ ఇంకా ప్రారంభమే కాలేదు. ఉన్నత విద్యపై సీఎం జగన్‌, ప్రభుత్వం చేస్తున్న ఆర్భాట ప్రకటనలకు.. వారి చేతలకు పొంతనే కుదరడం లేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తుపై దుష్ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయి.

'విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలిసిన అవసంరం ఉంది. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​దే తదనుగుణంగా విద్యావ్యవస్థలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ను ప్రవేశపెట్టడంతో.. విద్యార్థులను గ్లొబల్ లీడర్స్​గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేయాల్సిన అవసం మనపై ఉంది. భయటి ప్రపంచంతో పోటి పడాలంటే... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ ద్వారానే సాధ్యం అవుతుంది.'- సీఎం జగన్

ఉన్నత విద్యపై సీఎం జగన్‌ చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలివి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పరిస్థితి అసలేం బాగాలేనట్లు మాట్లాడిన ఆయన... విద్యార్థుల భవిష్యత్తు గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఆచరణలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను సైతం ఉన్నత విద్యామండలి సకాలంలో నిర్వహించలేకపోతోంది. దీంతో విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల.. విద్యార్థులు విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. పీజీ కోర్సుల్లో చేరేందుకు నిరీక్షించాల్సి వస్తోంది. ఉన్నత విద్యలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ, ప్రపంచస్థాయి ప్రమాణాలంటూ మాట్లాడే సీఎం జగన్‌... రాష్ట్రంలో ప్రవేశాలనే సకాలంలో చేయలేకపోతున్నారు. ఆగస్టు నెల వచ్చినా ఇప్పటి వరకు ప్రవేశాల కౌన్సెలింగే మొదలవలేదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికే... విశ్వవిద్యాలయాలు ఆపసోపాలు పడుతున్నాయి.

Group 1 Mains Results: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే

'గత విద్యాసంవత్సరం డిగ్రీకి సంబంధించి.. ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి ఎకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆరో సెమిస్టర్‌.. మార్చి 13 నుంచి ప్రారంభమై జూన్‌ 10తో ముగియాలి. జూన్‌ 12 నుంచి 24 వరకు పరీక్షలు పూర్తికావాలి. కానీ వర్సిటీలు ఇప్పటికీ చాలా చోట్ల చివరి ఏడాది ఫలితాలు విడుదల చేయలేదు. ఫలితాలు వస్తేనే పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ చేపట్టాల్సి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఇంకా పరీక్షలే నిర్వహిస్తోంది. శ్రీవేంకటేశ్వర, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. ఎంపీఏ(MBA), ఎమ్​సీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఐసెట్‌ నిర్వహించగా.. విద్యార్థులు అప్పటి నుంచి కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలకు నిర్వహించే పీజీ సెట్‌ను జూన్‌ 6 నుంచి 10 వరకు నిర్వహించగా... 22 వేల 858 మంది అర్హత సాధించారు.'- సాయికుమార్‌, విద్యార్థి సంఘం నాయకుడు

CUET-UG ఫలితాలు విడుదల.. మీ ర్యాంకు​ చెక్ చేసుకున్నారా?

బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌... ఓ ప్రహసనంగా మారుతోంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌ను.. ఈ ఏడాది జూన్‌ వరకు నిర్వహిస్తూనే వచ్చారు. కోర్టు కేసులు, EWS, యాజమాన్య, స్పాట్‌ కోటాల భర్తీకి నెలల సమయం తీసుకున్నారు. దాదాపు ఒక విద్యా సంవత్సరాన్ని గత ఏడాది విద్యార్థులు కోల్పోయారు. లాసెట్ పూర్తిచేసినా.. కౌన్సెలింగ్ చేపట్టడం లేదు. పీహెచ్​డీ (P.H.D) ప్రవేశాలకు నిర్వహించే ఆర్-సెట్‌ కౌన్సిలింగ్‌లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. జేఆర్ఎఫ్ (J.R.F.), (ఎస్ఆర్ఎఫ్)S.R.F. ఫెలోషిప్‌ ఉన్నవారికి విశ్వవిద్యాలయాలే సీట్ల కేటాయింపు పూర్తిచేశాయి. పీజీ అర్హతతో ఆర్‌సెట్‌ రాసినవారికి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయించాలి. విశ్వవిద్యాలయాలు ఖాళీల వివరాలు ఇవ్వలేదంటూ.. ఉన్నత విద్యామండలి దీన్ని వాయిదా వేస్తూ వస్తోంది. వర్సిటీలు, ఉన్నత విద్యామండలి మధ్య సమన్వయం కొరవడటంతో... అభ్యర్థులకు పడిగాపులు తప్పడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.