ETV Bharat / state

Anti Democratic Acts in CM Jagan Government: రాష్ట్రంలో జగనన్న రాజ్యాంగం వర్సెస్ భారత రాజ్యాంగం!.. ప్రజాస్వామిక హక్కులపై జగన్ ఉక్కుపాదం - Pawan Kalyan from Hyderabad to Vijayawada

Anti Democratic Acts in CM Jagan Government: ఉగాండాలో ఇడి అమీన్‌.. దక్షిణ కొరియాలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు.. అంతకుమించిన అరాచకాన్ని గత నాలుగున్నరేళ్లుగా జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తోంది. ఆ నియంతలను తలదన్నే నిరంకుశ పాలన సాగిస్తోంది. నిరసన తెలపటం నిషేధం అన్నట్లు హక్కుల కోసం నినదించటం చట్టవిరుద్ధమైనట్లు వ్యవహరిస్తోంది. అన్యాయంపై ప్రశ్నించటం మహానేరంగా అక్రమాలపై నిలదీయటం శిక్షార్హంగా భావిస్తోంది. ఇక్కడ ఐపీసీ చట్టాల స్థానంలో వైసీపీ చట్టాలు అమలు చేస్తారు. సీఆర్‌పీసీ బదులు వైసీపీ ప్రొసీజర్‌ కోడ్‌ పాటిస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అంతర్భాగమేనా? ఇదేమైనా ప్రత్యేకరాజ్యమా? ఇక్కడ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాలరాసి జగన్‌ ప్రభుత్వ విరచిత అరాచక రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Anti_Democratic_Acts_in_CM_Jagan_Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 9:46 AM IST

Updated : Sep 20, 2023, 10:36 AM IST

Anti Democratic Acts in CM Jagan Government: రాష్ట్రంలో జగనన్న రాజ్యాంగం వర్సెస్ భారత రాజ్యాంగం!.. ప్రజాస్వామిక హక్కులపై జగన్ ఉక్కుపాదం

Anti Democratic Acts in CM Jagan Government : శాంతియుత నిరసన పౌరుల ప్రాథమిక హక్కు అని మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రాథమిక హక్కు పౌరులకు ఉందని ఏకపక్ష పాలన లేదా శాసనపరమైన చర్యల ద్వారా దీన్ని రద్దుచేయలేము అని రామ్‌లీలా మైదాన్‌ సంఘటన్‌ వర్సెస్‌ హోం సెక్రటరీ, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Iron Footing on Democratic Rights in YSRCP Govenment : నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు ప్రాథమిక హక్కులో భాగం. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అవి పునాదులు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు చెప్పినా పోలీసులు అనుమతి నిరాకరించటం సరికాదు. క్రమశిక్షణ కలిగిన ఒక పార్టీ వందమందితో శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామంటే మీకు అభ్యంతరమెందుకు? అని కడప ఉక్కుపరిశ్రమ సాధన కోసం సీపీఐ తలపెట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశిస్తూ గతేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Jagan Government Iron Footing on Democratic Rights : రాజకీయ నేతలు వేలమందితో పాదయాత్రలు చేయొచ్చు గానీ.. 600 మంది రైతులు పాదయాత్ర చేయకూడదా? దానికి మీరు అనుమతివ్వరా? శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును ఎలా కాదంటారు? శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో అనుమతి ఎలా నిరాకరిస్తారు? ఒక వర్గం ఆకాంక్షలకు భిన్నంగా మరో వర్గం ఎప్పుడూ ఉంటుంది. ఆ కారణం చెప్పి నిరసనలకు అనుమతి నిరాకరించటం సరికాదు.

గతంలో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది అని అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిచ్చిన సందర్భంగా గతేడాది సెప్టెంబరు 9న ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 దేశ పౌరులకు నిరసన, అసమ్మతి తెలిపే హక్కు కల్పిస్తోంది. ఆర్టికల్‌ 19(1)(ఏ) వాక్‌, భావ ప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్‌ 19(1)(బీ) ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, ఆర్టికల్‌ 19(1)(సీ) ప్రదర్శనలు, ఆందోళనలు, బహిరంగ సభల ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించటానికి, వ్యతిరేకించటానికి, దీర్ఘకాలిక నిరసన ఉద్యమాలు చేపట్టటానికి వ్యక్తులు శాంతియుతంగా గుమికూడే స్వేచ్ఛ కల్పిస్తుంది.

Anarchies on Dalits: అధికార వైఎస్సార్​సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య

YSRCP Govenment Anarchies in AP : కానీ రాష్ట్రంలో హక్కుల కోసం ఎవరూ మాట్లాడకూడదన్నట్లు జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పౌరసంఘాలు హక్కుల కోసం నినదిస్తే వారిపై ఉక్కుపాదం మోపడమేంటి? ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటే అణచివేతేంటి? ప్రభుత్వ విధానాలపై నిరసన, శాంతియుత ప్రదర్శనలతో అసమ్మతి ప్రకటించేందుకు ప్రయత్నిస్తే అక్రమ కేసులు, నిర్బంధాలతో వేధించటమేంటి? ఇది అరాచకరాజ్యం కాకపోతే మరేంటి? ఈ పాలకుడు నియంత కాకపోతే మరేంటి?.

తనను అక్రమంగా అరెస్టు చేసినా సంయమనం పాటించాలనే పార్టీ శ్రేణులకు, అభిమానులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు మాత్రం చంద్రబాబు అరెస్టుపై సంబరాలు చేసుకున్నారు. సిట్‌ కార్యాలయం ఎదుటే బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే, కవ్వించే వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా నృత్యాలు చేశారు. ఇంత జరిగినా టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు, విధ్వంసానికి దిగలేదు.

ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుత నిరసనలు, అసమ్మతి తెలిపేందుకే యత్నించారు. వాటినీ అనుమతించకపోవటం ఏంటి? సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 పేరిట విధించే నిషేధాజ్ఞలు, నిర్బంధాలు వైసీపీకి ఎందుకు వర్తించవు? సిట్‌ కార్యాలయం ఎదుటే వైసీపీ నాయకులు బాణసంచా కాలుస్తుంటే పోలీసులు ఎందుకు చేతులు ముడుచుకు కూర్చున్నారు? వైసీపీ నాయకులు గుమిగూడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును (Chandrababu Naidu Arrest) నిరసిస్తూ విజయవాడలోని వీఆర్‌ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం విద్యార్థులు శాంతియుత నిరసన తలపెట్టేందుకు యత్నించగా పోలీసులు ఉక్కుపాదంతో అణిచేశారు. భారీగా బలగాల్ని మోహరించి.. కళాశాలను వారి ఆధీనంలోకి తీసుకుని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించేలా చేశారు. విద్యార్థులు నేరుగా ఇళ్లకు వెళ్లాలని, రాస్తారోకో, ధర్నాలు, నిరసన ర్యాలీల్లో పాల్గొనొద్దని హెచ్చరించారు.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరంలో వారు బసచేసిన శిబిరం వద్దకు ఇటీవల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలిరాగా వారినీ పోలీసులు అనుమతించలేదు. చంద్రబాబుకు మద్దతుగా విజయవాడ బెంజ్‌సర్కిల్‌లో ఇటీవల మహిళలు, యువత, ఐటీ ఉద్యోగులు, సామాన్యప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శాంతియుత నిరసన చేపట్టగా వారిపైనా కేసులు నమోదు చేశారు.

Students Future Does Not Care Jagan Government: రాష్ట్రం, యువత భవిష్యత్తు నాశనమైతే నాకేంటి?.. చంద్రబాబుపై పగ సాధించడమే లక్ష్యం!

చంద్రబాబు అరెస్టుపై నిరసనలు తెలిపేందుకు ఎక్కడికక్కడ ప్రజలు, టీడీపీ శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకు కదలగా సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 అమల్లో ఉన్నాయంటూ వారిని గృహ నిర్బంధం చేశారు. అసలు బయటికే రానివ్వకుండా అణిచేశారు. వచ్చిన వారిని లాఠీలతో కొట్టారు. చివరికి టీడీపీ చేపడుతున్న రిలే దీక్షాశిబిరాలకు టెంట్లు, కుర్చీలు అద్దెకు ఇచ్చేవారినీ కేసుల పేరుతో బెదిరించి అడ్డుకున్నారు. ప్రైవేటు స్థలాల్లో దీక్షాశిబిరాలు నిర్వహిస్తుంటే.. స్థలాల యజమానులను హెచ్చరించి, భయపెట్టి ఆ శిబిరాల్ని ఎత్తివేయిస్తున్నారు.

మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చేందుకు సిద్ధమవ్వగా ఆయన ఇక్కడకొస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున విమానాన్ని అనుమతించొద్దని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌కు లేఖ రాసి విమానంలో రానివ్వలేదు. ఆయన రోడ్డుమార్గాన వస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లోకి రాగానే అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి మంగళగిరిలో విడిచి పెట్టారు.

ప్రభుత్వంపై తమ అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం చేయడానికి పౌరులు నిరసనలు, ప్రదర్శనలు, సామూహిక ర్యాలీల వంటి మార్గాలే అనుసరిస్తారు. నిరసనలు తెలపటం, వాటిని సామూహిక ఉద్యమాలుగా మార్చటం ప్రజాస్వామ్యంలో పౌరస్వేచ్ఛకు ప్రతీకలు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పేరిట జగన్‌ ప్రభుత్వం వాటిని కాలరాస్తోంది.

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు షరతులతో అనుమతించి అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. అమరావతి రైతులు పాదయాత్రకు అనుమతి కోరితే శాంతి భద్రతల సమస్య పేరుతో నిరాకరించారు. దీంతో వారు హైకోర్టు అనుమతి తెచ్చుకుని పాదయాత్ర చేపట్టగా దానికీ ఇబ్బందులు సృష్టించారు. పల్నాడులో వైసీపీ నాయకుల చేతిలో హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు 2019 సెప్టెంబరులో 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపునివ్వగా.. ఉండవల్లిలోని నివాసం నుంచే బయటకు రానీయకుండా తాళ్లతో గేట్లు కట్టేసి అడ్డుకున్నారు.

ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జనవాణి నిర్వహించేందుకు విశాఖపట్నం వెళితే వాహనం నుంచి బయటకు కనిపించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఆయన బసచేసిన హోటల్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించి అలజడి సృష్టించారు. తర్వాత రోజు ఆయన్ను హోటల్‌ నుంచి బయటకు రానీయకుండా చేశారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ, ఆయన త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు మంగళవారం వివిధ దేవాలయాల్లో పూజలు చేయడానికి వెళ్తుంటే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్య నాయకుల్ని బయటకు రానీయకుండా ఇళ్లలోనే నిర్బంధించారు. జగన్‌ పాలనలో ఆలయానికి వెళ్లటమూ నేరమేనా?

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఏదైనా నిరసన ప్రదర్శనలకు పిలుపిస్తే చాలు ఆయా సంఘాల ప్రతినిధులందరికీ నోటీసులివ్వటం, గృహనిర్బంధాలు, ఎక్కడికీ కదలనీయకుండా అడ్డుకోవటం, భారీ ఎత్తున బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురిచేయటమే పని అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కులసంఘాలకే ప్రత్యేక నిర్బంధాలు అమలుచేస్తున్నారు. 'హౌస్‌ అరెస్టు' అనేది సీఆర్‌పీసీలోనే లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇటీవల వాదనలు వినిపించారు. మరి వాటిని ఎలా అమలు చేస్తున్నారు? కర్నూలు జిల్లాలో జగన్‌ పర్యటన నేపథ్యంలో మంగళవారం వామపక్ష, ప్రజాసంఘాల నేతలు, సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Prathidwani: ప్రజాస్వామ్యమా ? వైఎస్సార్సీపీ ప్రైవేటు సామ్రాజ్యమా..?

Last Updated : Sep 20, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.