ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో కుక్క మృత్యువాత.. అడ్డుగా నిలిచిన మరో శునకం.. - ఏపీలో కుక్క మరణం

dog showed love to a dead dog: మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తన తోటి శునకం మరణించడంతో.. దానిపైకి ఎటువంటి వాహనాలు రాకుండా అడ్డుగా ఉంది మరో శునకం. అటుగా వెళ్తున్న వారంతా ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ఈ ఘటన గుంటూరు శివారులో చోటు చేసుకుంది.

కుక్క ప్రేమ
Dog shows the humanity
author img

By

Published : Nov 23, 2022, 11:37 AM IST

dog showed love to a dead dog: ప్రమాదంలో ఎవరైనా రోడ్డుపై పడిపోతే.. ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరిదారిన వారు వెళ్లిపోతున్న రోజులివి. కష్టాల్లో ఉన్న సాటివారి పట్ల కనీసం మానవత్వం చూపించడం లేదు. కానీ ఓ శుకనం మాత్రం సాటి కుక్క చనిపోతే ఎంతగానో చలించింది. గుంటూరు శివారులోని పొత్తూరు సమీపంలో జాతీయ రహదారి దాటుతున్న ఓ శునకాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. అది అక్కడికక్కడే చనిపోయింది. దీన్ని చూసిన మరో శునకం.. తన సహచర నేస్తం మృతిని తట్టుకోలేకపోయింది. చనిపోయిన శునకం మృతదేహం పక్కకు వచ్చి.. వాహనాలను అటు రానివ్వకుండా అడ్డుగా నిలబడింది. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దృశ్యాలను చూసి మూగజీవులకున్న మానవత్వం మనుషుల్లో కరవైందంటూ చర్చించుకున్నారు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.