ETV Bharat / state

'హామీలు నెరవేర్చే వరకు వెనకడుగు వేసేదేలేదు' - తొమ్మిదో రోజుకు చేరిన అంగన్​వాడీల ఆందోళన - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

Anganwadi protest 9th day : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తొమ్మిదో రోజునా కదం తొక్కారు. జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వినూత్న నిరసనలు, ర్యాలీలతో హోరెత్తించారు. తమ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా హామీలు నెరవేర్చేవరుకు వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు.

anganwadi_protest_9th_day
anganwadi_protest_9th_day
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 5:42 PM IST

Updated : Dec 20, 2023, 6:56 PM IST

Anganwadi protest 9th day : ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తోన్న సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించాలని విజయనగరం కలెక్టరేట్‌ అంగన్వాడీలు నిరసన చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళుతూ భిక్షాటన చేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా నిరసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైలవరంలో అంగన్వాడీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. సీఎం జగన్ నా అక్కాచెల్లెలు అంటూ నమ్మించి తమను రోడ్డున పడేసి భిక్షమెత్తుకునేలా చేశారని గుంటూరు ప్రధాన రహదారిపై అంగన్వాడీలు భిక్షాటన చేశారు.

ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం: అంగన్వాడీలు

Anganwadi protest in andhra pradesh : బాపట్ల జిల్లా చీరాలలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులో సచివాలయ ఉద్యోగులు అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టే యత్నం చేయగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు తమకు మధ్య గొడవలు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో భిక్షాటన చేశారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద వంటావార్పు చేపట్టారు. అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిర్ నుంచి టవర్ క్లాక్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీలతో కలిసి చిన్నారుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు.

పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం

Anganwadi Employees Fires on CM Jagan : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో అన్నీ దుకాణాలకు తిరుగుతూ జోలె పట్టి భిక్షాటన చేశారు. కడపలోని రైతు బజార్ మార్కెట్ లో అంగన్వాడీలు భిక్షాటన చేయగా అక్కడున్న వ్యాపారులు, రైతులు వారికి కూరగాయలు ఆకుకూరలు భిక్షంగా వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ICDS కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకొని ఆందోళన చేశారు. తొమ్మిదవ రోజుకు చేరిన సందర్భంగా కార్యాలయం ఎదుట 9 అక్షరం మాదిరి కూర్చుని నిరసన తెలిపారు.

ఆగని అంగన్వాడీల పోరు - ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సమ్మె విరమించేదేలే

Anganwadi protest Stopped by Police in andhra pradesh : కర్నూలు జిల్లా పత్తికొండలో అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీలు మంత్రిని కలిసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పెద్దఎత్తున తరలి వచ్చిన అంగన్వాడీలు పోలీసులను ఛేదించుకుని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి బయటకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.

Last Updated : Dec 20, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.