ETV Bharat / state

వైఎస్సార్​ సంపూర్ణ పోషణ కిట్ల సరఫరా.. టెండర్‌ను ప్రివ్యూకి ఎందుకు పంపలేదు: హైకోర్టు - శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌

YSR Sampoorna Poshana Kits: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ సరఫరా కోసం ఈనెల 14న పిలిచిన టెండర్‌ను సవాలు చేస్తూ.. శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని సావిత్రి, మరికొందరు హైకోర్టులో అత్యవసరంగా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

Andhra Pradesh High Court
ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు
author img

By

Published : Oct 29, 2022, 4:13 PM IST

YSR Sampoorna Poshana Kits: వంద కోట్ల అంచనాలకు పైబడిన టెండర్ల విధివిధానాలను పరిశీలించేందుకు జ్యుడీషియల్‌ ప్రివ్యూని ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల సరఫరా కోసం పిలిచిన టెండర్‌ను ప్రివ్యూకి ఎందుకు పంపలేదని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మొదటిసారి పిలిచిన టెండర్‌ను రద్దు చేసి రెండోసారి టెండర్‌కు పిలవడానికి, నిబంధనల్లో మార్పులు చేయడానికి కారణాలేంటని నిలదీసింది. టెండర్‌ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ సరఫరా కోసం ఈనెల 14న పిలిచిన టెండర్‌ను సవాలు చేస్తూ శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని సావిత్రి, మరికొందరు హైకోర్టులో అత్యవసరంగా వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. అనుకూలమైన వారికి ప్రయోజనం చేసే నిమిత్తం టెండర్‌ నిబంధనల్లో సవరణ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.

జ్యుడీషియల్‌ ప్రివ్యూ పరిధి నుంచి అధిగమించాలన్న ఉద్దేశంతో టెండర్‌ విలువను ప్రస్తావించలేదన్నారు.టెండర్‌ మొత్తం 100 కోట్లకు మించిందా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారి నుంచి వివరాలు సేకరించి.. కోర్టు ముందు ఉంచుతానని ప్రభుత్వ న్యాయవాది శశిభూషణ్‌రావు అభ్యర్థించారు. టెండర్‌ విలువ 100 కోట్లకు మించలేదని అధికారి ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సంబంధిత వ్యక్తిపై అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్.రఘునందన్‌రావు హెచ్చరించారు. ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.