ETV Bharat / state

ఉద్రిక్తంగా మారిన అఖిలపక్షాల 'చలో అసెంబ్లీ'.. ఉక్కుపాదం మోపిన పోలీసులు - GO No 1 issue

Akhilapaksha angry with GO No.1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్-1ను పూర్తిగా రద్దు చేయాలంటూ అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ' ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర నలుమూలల నుంచి బయలుదేరిన సీపీఐ నేతలను, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఎన్నిసార్లు అడ్డుపడినా.. జీవో నంబర్-1ని రద్దు చేసేవరకూ పోరాటం చేస్తూనే ఉంటామని వామపక్ష పార్టీల నేతలు తేల్చి చెప్పారు.

Akhilapaksha
Akhilapaksha
author img

By

Published : Mar 20, 2023, 8:28 PM IST

Updated : Mar 20, 2023, 9:21 PM IST

Akhilapaksha angry with GO No.1: ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్-1ను ప్రవేశపెట్టిందని.. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈరోజు అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ' ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర నలుమూలల నుంచి బయలుదేరిన సీపీఐ నేతలను, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, 151 సీఆర్సీపీ నోటీసు ఇచ్చిన పోలీసులు.. ఆదివారం రాత్రి నుంచే పలువురు కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో జీవో నెంబర్-1 రద్దు చేయాలంటూ..ఈరోజు అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ'పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

వివరాల్లోకి వెళ్తే.. జీవో నెంబర్-1 రద్దు చేయాలంటూ.. అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ'పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. శాసన సభకు వెళ్తున్న సీపీఐ నేతలను, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పౌర హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని నేతలు మండిపడ్డారు.

ఈ క్రమంలో జీవో నెంబర్‌ 1కి వ్యతిరేకంగా అఖిలపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో.. పోలీసుల ఆంక్షల పేరిట నేతలను నిర్బంధించారు. ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేపట్టారు. శాసనసభకు వెళ్తున్న సీపీఐ నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను గుంటూరు జిల్లా మందడం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 1 అనేది ఒక దుర్మార్గమైనది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే జీవో అది. ఆ జీవోకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీలన్నీ ఏకమై, ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

మరోవైపు జీవో నెంబర్‌ 1 రద్దు పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నేతలు ర్యాలీ నిర్వహించారు. జీవో నెంబర్ 1ని అడ్డం పెట్టుకుని ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన సీపీఐ నేత రామకృష్ణ, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జీవో నెంబర్‌ వన్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఉద్రిక్తంగా మారిన అఖిలపక్షాల 'చలో అసెంబ్లీ'.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వామపక్ష పార్టీల నేతలు.. జీవో నంబర్-1 ని రద్దు చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోను ఉపసంహరించుకోవాలంటూ జీవో ప్రతులను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని.. పోలీసులు అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జీవో నం.1 రద్దు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 20, 2023, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.