ETV Bharat / state

Trying to Buy TRS MLAs: నిందితులపై కేసు.. FIR కాపీలో కీలక విషయాలు - bjp agents buy a trs mlas

తెరాస ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తెరాసకు రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో భాజపాలో చేరితే రూ.వంద కోట్లు ఇస్తామని ఆ పార్టీ హైకమాండ్ నుంచి హామీ ఇచ్చినట్లు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫిర్యాదులో స్పష్టం చేశారు. పార్టీ మారకపోతే ఈడీ, సీబీఐతో దాడులు చేస్తామని బెదిరించినట్లు రోహిత్‌ ఫిర్యాదులో పేర్కొన్నారని ఏసీపీ తెలిపారు.

Trying to Buy TRS MLAs
ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు
author img

By

Published : Oct 27, 2022, 12:10 PM IST

Trying to buy TRS MLAs: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు పొందుపర్చారు. తెరాస ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భాజపాలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతీ ఆఫర్ చేశారని... నందు మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు సతీష్‌ శర్మ, సింహయాజులు వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

తెరాసకు రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో భాజపాలో చేరితే రూ.వంద కోట్లు ఇస్తామని ఆ పార్టీ హైకమాండ్ నుంచి హామీ ఇచ్చినట్లు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫిర్యాదులో స్పష్టం చేశారు. భాజపాలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కమలంలో చేరితే సెంట్రల్‌ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి పోలీసులకు వివరించారు. తనకు రూ.వంద కోట్లతో పాటు తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారని రోహిత్‌ రెడ్డి పేర్కొన్నారు. రామచంద్ర భారతి, నందకుమార్‌ ఇద్దరు కూడా భాజపాకి చెందిన వ్యక్తులుగా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో రోహిత్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ2గా హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌ ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం 8 కింద కేసు నమోదు చేయగా.. సెక్షన్ 120బి కింద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్‌ ఏసీపీ తెలిపారు. డబ్బు ఆశతో పాటు కాంట్రాక్టు పనులు ఇస్తామన్నట్లు ఆశచూపారని రోహిత్‌ ఫిర్యాదు చేశారని ఏసీపీ వెల్లడించారు. పార్టీ మారకపోతే ఈడీ, సీబీఐతో దాడులు చేస్తామని బెదిరించినట్లు రోహిత్‌ ఫిర్యాదులో పేర్కొన్నారని ఏసీపీ తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.