An old man achieved with determination: సైకిల్‌పై దూసుకుపోతున్న ఈయన ఆర్ .రమేశ్ బాబు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావిపాలెంకు చెందిన ఈయన.. విజయవాడలో స్థిరపడ్డారు. 2010లో జరిగిన ఓ సంఘటన.. ఈయన జీవితాన్నే మార్చేసింది. ఓ సదస్సు కోసం కొచ్చి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు 120 కిలోలు ఉన్న ఓ భారీ వ్యక్తి పైన పడటంతో వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది. కుడి కాలికీ గాయమైంది. ఆస్పత్రికి తరలించగా...నెలల వ్యవధిలోనే 3 శస్త్ర చికిత్సలు చేశారు. జీవితంలో.. ఇక నడిచే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఇంట్లో మంచానికే పరిమితమైన రమేశ్.. మానసికంగా కుంగిపోయారు. ఆ సమయంలోనే పరామర్శకు వచ్చిన ఓ మిత్రుడు రమేశ్‌కు పుస్తకం ఇచ్చారు. అది ఆయన్ను మళ్లీ మనిషిని చేసింది. దృఢ సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ తెలుసుకున్న రమేశ్ అప్పటి నుంచి నడవడం ప్రారంభించారు. ఇప్పుడిలా సైక్లింగ్‌లో దూసుకుపోతున్నారు.
Amaravati Runners: వైద్యులు చెప్పినట్లు తాను మంచంలోనే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు రమేశ్. సైకిల్ తొక్కడం శారీక శ్రమేనంటున్న ఆయన.. తన జీవితాన్ని ఉదాహరణగా చూపి... ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. 2015లో అమరావతి రన్నర్స్ అనే సంస్థను స్థాపించి.. సైక్లింగ్ అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు.
Cycling: మంచానికే పరిమితమైన స్థితి నుంచి సైకిల్ యాత్ర చేసే స్థాయికి చేరిన రమేశ్.. రాష్ట్ర,జాతీయ స్థాయిల్లో అనేక సైక్లింగ్ పొటీల్లో పాల్గొన్నారు. ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ప్యారిస్‌లో నాలుగేళ్లకు ఒకసారి జరిగే పొటీలకు వెళ్లేందుకు ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఎవరెస్ట్‌పై కూడా 20,700 అడుగుల వరకు వెళ్లిరావడం జరిగిందని రమేష్ చెబుతున్నారు. ఈ వయస్సులో మన పిల్లలకు పెద్దగా ఇచ్చేది ఏం ఉండదని.. మనం ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు సంతోషంగా ఉంటారని అంటున్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే..అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని రమేశ్ సూచిస్తున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం, అతిగా ఆలోచించడం వల్లే మనిషి మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. అందరికీ వందేళ్ళ పాటు ఆయుష్షు ఉంటుంది.. కానీ సరైన వ్యాయామం చేయకపోవడం వల్లే తర్వాత ఆనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. -రమేష్ బాబు, అమరావతి రన్నర్స్ వ్యవస్థాపకుడు
ఇవీ చదవండి: