ETV Bharat / state

వైద్యం పేరుతో నకిలీ డాక్టర్... ఉద్యోగాల పేరిట కానిస్టేబుల్.. సీన్ కట్ చేస్తే..!

fake Doctor, Cheating constable : ఇంటర్మీడియట్ చదివిన ఓ వ్యక్తి తానొక వైద్యుడినని అని చెప్పుకుంటూ అస్పత్రుల్లో వైద్యులు, రోగుల దగ్గర డబ్బు వసూళ్లకు పాల్పడ్జాడు. వరుస మోసాలతో నిఘా పెట్టిన పోలీసులు.. చివరికి ఆట కట్టించారు. ఇక.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కానిస్టేబుల్​పై నంద్యాల జిల్లాలో కేసు నమోదు చేశారు.

case agains constable
Fake Doctor Arrested
author img

By

Published : Apr 9, 2023, 7:44 PM IST

fake Doctor, Cheating constable : అతను ఇంటర్ చదివాడు. కొంత కాలం వైద్యుల వద్ద సహాకుడిగా పనిచేశాడు. డబ్బుపై ఆశతో నకిలీ వైద్యుని అవతారమెత్తాడు. నగరంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వ్యైద్యుడినని చెప్పి డబ్బు గుంజాడు. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ముమ్మర దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా దవల గ్రామానికి చెందని జయరాం అనే వ్యక్తి... విశాఖ జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుని సహాకుడిగా పనిచేశాడు. ఉన్నట్టుండి వైద్యుడిగా మారి విజయనగరం నుంచి విజయవాడకు మకాం మార్చాడు.

విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ వద్దకు జయరాం వెళ్లాడు. తనను ఓ అనస్తీషియా డాక్టర్​గా పరిచయం చేసుకున్నాడు. ఆ పేషెంట్​తో ట్రీట్మెంట్ తానే చేయాలని చెప్పాడు. అనుమానం రాకుండా పేషెంట్ కేసు షీట్ పరిశీలించాడు. అనంతరం మాట మాట కలిపాడు... తన ఫోన్లో డబ్బులు లేవనీ.. వేరే వారికి అత్యవసరంగా నగదు పంపాలని నమ్మించి రూ. 7500 దోచుకున్నాడు. అనంతరం మరో ఆసుపత్రికి వెళ్లాడు. ఇదే తరహాలో మరో వైద్యుడి నుంచి రూ. 10 వేలు డబ్బు కాజేశాడు. జయరాంపై అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా ఉంచారు. అమెరికన్ ఆసుపత్రిలో నగదు దోచేస్తుండగా జయరాంను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి రూ.4,500 నగదు, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రుల్లో పేషెంట్లు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి జయరాం అడ్డదార్లు తొక్కాడని పోలీసులు వెల్లడించారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన నంద్యాలకు చెందిన పోలీసు కానిస్టేబుల్ శివయ్య పై కేసు నమోదైంది. శివయ్య నంద్యాల ట్రాఫిక్ పోలీసు స్టేషన్​లో, కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అమాయకులైన యువత నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. శివయ్యను నమ్మిన నంద్యాల శ్రీనివాసనగర్ కు చెందిన సాయి నిరంజన్ డబ్బులు చెల్లించాడు. శివయ్యకు డబ్బు చెల్లించినా ఉద్యోగాలు ఇప్పించలేదు. ఈ క్రమంలో సాయి నిరంజన్ నంద్యాల తాలూకా పోలీసు స్టేషన్​లో శివయ్యపై ఫిర్యాదు చేశారు. ఓ పేరున్న కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామంటే రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో సాయి నిరంజన్ పేర్కొన్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ శివయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరి కొంతమంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ డా.రవికిరణ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.