కర్నూలు కార్పొరేషన్ వైకాపా వశం అయింది. మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ సత్తా చాటింది. జిల్లా వ్యాప్తంగా నగరపాలక సంస్థతోపాటు ఏడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీలో కలిపి 302 వార్డులున్నాయి. వీటిలో 77 ఏకగ్రీవం అవ్వగా, 225 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వెలువడిన పుర ఫలితాల్లో వైకాపా ప్రభంజన సృష్టించింది.
కర్నూలు కార్పొరేషన్లో 52 డివిజన్లు ఉండగా.. వైకాపా 41, తెదేపా 8, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. డోన్ మున్సిపాలిటీ మొత్తం 32 వార్డుల్లో 31 వైకాపా, సీపీఐ 1 గెలుచుకుంది. ఆత్మకూరులో 24 స్థానాల్లో వైకాపా 21, తెదేపా 1, ఇతరులు 2 గెలుపొందారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. 27 వార్డుల్లో వైకాపా 22, తెదేపా 2, భాజపా 2, స్వతంత్రులు 1 గెలిచారు. ఆదోని మున్సిపాలిటీని వైకాపా వశం చేసుకుంది. 42 వార్డుల్లో వైకాపా 40, తెదేపా 1, స్వతంత్రులు 1 విజయం సాధించారు. నంద్యాలలోనూ.. వైకాపా విజయ దుందుభి మోగించింది. 42 వార్డుల్లో వైకాపా 37, తెదేపా 4, స్వతంత్రులు 1 స్థానాల్లో గెలుపొందారు. గూడూరు నగర పంచాయతీలో వైకాపా 12, తెదేపా 3, భాజపా 1, ఇతరులు 4 చోట్ల గెలిచారు.
11 ఏళ్ల తర్వాత పాలకవర్గం
కర్నూలు కార్పొరేషన్‌కు 2005లో ఎన్నికలు జరిగాయి. అప్పడు ఎన్నికైన పాలకవర్గం 2010 వరకు పనిచేశారు. ఆ తర్వాత 11 ఏళ్లుగా పాలకవర్గం లేకుండా, ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. చాలా ఏళ్ల తర్వాత.. ఇప్పుడు పాలకవర్గం పగ్గాలు చేపట్టనుంది.
ఇదీ చదవండి: ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్‌లో ఫ్యాన్ గాలి