కర్నూలు జిల్లా పత్తికొండలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ధర్నా చేశారు. పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు మురళీధర్‌రెడ్డి దేవర ఉత్సవం నిర్వహించారు. దీనికి రాష్ట్ర మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ దేవర ఉత్సవంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతినాయుడు సామాజిక మాధ్యమాల్లో వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టాడనే కారణంతో...ఆయనతో గొడవకు దిగారు.
రాత్రి 11 గంటల సమయంలో మురళీధర్‌రెడ్డికి చెందిన పోచిమిరెడ్డి యువసైన్యం ఆధ్వర్యంలో క్రాంతినాయుడు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. తమ జోలికి వస్తే చంపేస్తామని ...కుటుంబ సభ్యులను బెదిరించారని క్రాంతినాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు సమాచారం అందించానని... పోలీసుల ఎదుటే వైకాపా నాయకులు హల్చల్ చేశారని వాపోయాడు. రాత్రి జరిగిన ఘటనను నిరసిస్తూ .. ఉదయం క్రాంతినాయుడు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఆయనకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు వచ్చి క్రాంతినాయుడితో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్రాంతినాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. 'శ్రీవారిని దర్శించుకునే ముందు జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాలి'