Aspari Village Youth Protest: కర్నూలు జిల్లా అస్పరిలో స్థానిక ఎస్సైకి వ్యతిరేకంగా పలువురు యువకులు నిరసన వ్యక్తం చేశారు. ఓ కేసు విషయంలో తమ వారికి అన్యాయం జరిగిందని ప్రశ్నించినందుకు ఆస్పరి ఎస్సై ముని ప్రతాప్.. తమను దారుణంగా కొట్టారని ఆస్పరి గ్రామ యువకులు ఆరోపించారు. తమ సామగ్రి ధ్వంసం చేయడంతోపాటు అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
'మా తమ్ముడు వీరేశ్.. ప్రొక్లైయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 5 నెలల జీతం ఇవ్వాల్సి ఉండగా.. అడిగినందుకు అతన్ని యజమాని దాడి చేశారు. ఈ విషయమై న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే మమ్ముల్ని పోలీస్ సిబ్బంది కొట్టారు. దీనికి నిరసనగా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాం. దానికి గానూ ఆస్పరి ఎస్సై తమపై అక్రమ కేసులు పెట్టడంతోపాటు తమను విచక్షణారహితంగా కొట్టాడు' అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడికి పాల్పడిన ఎస్పై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
SI Suspension: రేపూడితండా వాసి ఆత్మహత్య ఘటనలో ఎస్‌ఐ సస్పెన్షన్