ETV Bharat / state

YAGANTI TEMPLE KURNOOL: ప్రమాదంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి దేవాలయం

Yaganti Temple in kurnool district : అక్రమ మైనింగ్ దెబ్బకు పర్యావరణమే కాకుండా ప్రసిద్ధ దేవాలయాలు సైతం ప్రమాదంలో పడుతున్నాయి. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన యాగంటి క్షేత్రం మైనింగ్ మాఫియా కోరల్లో చిక్కుకుంది. ఆలయ సమీపంలో జరుగుతున్న పేలుళ్లతో గాలిగోపురం, బసవన్న మండపం, మెట్ల మార్గం బీటలు వారుతున్నాయి. ఫలితంగా చారిత్రక మందిరానికి నష్టం వాటిల్లుతోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి దేవాలయం

author img

By

Published : Dec 9, 2021, 11:03 AM IST

ప్రమాదంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి దేవాలయం

Yaganti Temple in kurnool district: యాగంటి..! కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం ఎర్రమల అడవుల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. యాగంటి దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి ఖనిజ నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణంలో కట్టడాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయులు 1336లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రరస్వామి వారు ఈ పరిసర ప్రాంతాల్లోనే కాలజ్ఞానాన్ని రచించారని స్థానికులు చెబుతారు. అలాంటి ప్రసిద్ధ ఆలయం నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న పేలుళ్లతో ప్రమాద స్థితికి చేరుకుంది. మెట్ల మార్గం, ప్రధాన గాలిగోపురం దెబ్బతిన్నాయి.

ఆలయ మండపంలోని ఈశాన్య భాగంలో కొలువుతీరిన నందీశ్వరుడు.. ఏటా పెరుగుతుంటాడని ప్రతీతి. ఎంతో ప్రసిద్ధి చెందిన బసవన్న మండపం సైతం ముప్పు బారిన పడింది. కూలిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.