ETV Bharat / state

కర్నూలులో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన - కర్నూలులో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

కర్నూలు జిల్లాలో ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తెలంగాణలోని హైదరాబాద్​లో తన పేరుపై ఉన్న ఇంటిని భర్త, మామ అమ్మివేశారని... ఇల్లు ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు చూపిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరగాలని బాధితురాలు తన తల్లితో కలిసి ఆందోళన చేపట్టింది.

wife protest infront of husband house at kurnool district
కర్నూలులో భర్త ఇంటి ముందు బైఠాయింటి భార్య ఆందోళన
author img

By

Published : Sep 11, 2020, 8:37 AM IST

తనకు న్యాయం చేయాలని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట నిరసన తెలిపిన ఘటన కర్నూలులో జరిగింది. జిల్లాకు చెందిన మౌనికకు విజయ్ చంద్రతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత మౌనిక పేరుమీద తెలంగాణలోని హైదరాబాద్​లో ఉన్న ఇంటిని భర్త కుటుంబ సభ్యులు అమ్మేశారని బాధితురాలు ఆరోపించింది. తన పేరుమీద ఇల్లు ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు చూపించారన్నారు. తనను మోసం చేసిన భర్త, మామపై చర్యలు తీసుకుని... తనకు న్యాయం చేయాలని తన తల్లితో కలిసి ఆందోళనకు చేపట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న సమయంలో మౌనిక తల్లిపై... మౌనిక భర్త తరపు వారు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఇరువురిని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

రేపే... స్వయం సహాయక మహిళల ఖాతాల్లోకి 6, 792 కోట్లు: బొత్స

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.