ETV Bharat / state

20 ఏళ్ల తర్వాత జనరల్​కు జడ్పీ పీఠం.. గెలిచేదెవరో..?

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది చర్చనీయాంశం కాగా... జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఎవరు దక్కించుకుంటారనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో... పార్టీల గెలుపు వ్యూహాలేంటి... ఎవరు అధికారం చేపడతారనేది... ప్రస్తుతం జిల్లా వాసుల్లో నెలకొన్న ఉత్కంఠ.

author img

By

Published : Mar 9, 2020, 10:40 PM IST

kurnool zp
కర్నూలు జడ్పీ పీఠం ఎవరిదో..
కర్నూలు జడ్పీ పీఠం ఎవరిదో...

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, పురపాలక ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో.. పార్టీలన్నీ తలమునకలయ్యాయి. కర్నూలు జిల్లాలోనూ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు సహా కాంగ్రెస్, భాజపా, జనసేన, వామపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన జడ్పీ పీఠాన్ని 20 ఏళ్ల తర్వాత జనరల్​కు కేటాయించటంతో... బలమైన సామాజిక వర్గాల నుంచే గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పీఠం కోసం పోటాపోటీ...!

కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే చక్రం తిప్పుతాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా... 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైకాపా అధికారం చేపట్టి 9 నెలలు గడిచిపోయింది. ప్రస్తుతం జనం ఎటువైపు మొగ్గుచూపుతారో అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో మొదలైంది. తాజాగా స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించి... మరోసారి సత్తా చాటాలని అధికార వైకాపా... తమ బలాన్ని నిరూపించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కోట్ల, గౌరు కుటుంబాలు జడ్పీ పీఠం కోసం పోటీపడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరికి కేఈ కుటుంబం మద్దతు లభిస్తోంది. అధికార పార్టీ తరఫున బనగానపల్లి ప్రాంతానికి చెందిన ఎర్రబోతుల వెంకటరెడ్డి, నందికొట్కూరు వైకాపా బాధ్యుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎర్రబోతుల... కొలిమిగుండ్ల నుంచి జడ్పీటీసీగా పోటీచేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరికి మంత్రి బుగ్గన, ఎమ్మెల్యేలు కాటసాని సోదరులు, మంత్రాలయం బాలనాగిరెడ్డి సోదరులు, శిల్పా కుటుంబం నుంచి గట్టి మద్దతు లభిస్తోంది.

అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యే గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో... ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి:

'రేపల్లెలో తొలి రోజు ఒక్కటీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.