నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని... మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర నది తీరంలోని రాంపురం కాలువకు 10 కోట్ల రూపాయలతో జరుగుతున్న మరమ్మతు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల సంక్షేమానికి అవసరమైన ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేయడంలో సీఎం జగన్ ముందుంటారని పేర్కొన్నారు. కాలువ లైనింగ్ పనులు, షట్టర్ల ఏర్పాటు, కాలువ మరమ్మతు, అభివృద్ధి పనులకు అవసరమైన నివేదికలను రూపొందించి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: ఎస్ఈసీ