కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగటంతో... జూరాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం 86 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. ప్రాజెక్టులో 73 టీఎంసీల వరద నీరు ప్రవహస్తోంది. రాయలసీమ జీవనాడి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని వరద నీరు తాకింది. రోజురోజుకు వరద పెరుగుతుండటంతో... పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేయాలని రైతన్నలు కోరుతున్నారు.
ఇదీ చూడండి : నవంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ టీకా.. ధరెంతంటే?