కర్నూలు జిల్లా నంద్యాలలోని తితిదే కల్యాణ మండపం ఆవరణలో నీరు చేరి సమస్యగా మారింది. మండపం వెనుక భాగాన ఉన్న మురుగుకాలువ ఉద్ధృతంగా ప్రవహించటంతో... ఆ నీరు వచ్చి అక్కడికి చేరింది. ఎగువన ఉన్న చెరువు నీరు, పట్టణంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు ఈ కాలువలో చేరుతోంది. కాలువలో చెత్తా చెదారం అడ్డుపడ్డగానే నీరు, ఇక్కడకు చేరి ఇబ్బంది కలిగిస్తోంది. కాలువ ఆక్రమణకు గురవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాకాలంలో ఈ కల్యాణ మండపం ఆవరణలో నీరు చెరువును తలపిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి వానలు లేకున్నా కాలువ కారణంగా నీరు చేరుతోంది. తితిదే అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండీ...విజయవాడకు రెండు అత్యాధునిక సరకు రవాణా నడవాలు