కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓ ఎలుగు బంటి హల్చల్ చేసింది. సాయిబాబా నగర్, మార్కెట్‌యార్డ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న భల్లూకాన్ని స్థానికులు గుర్తించారు. మార్నింగ్ వాక్కు వచ్చిన ప్రజలను ఎలుగుబంటి వెంబడించి భయబ్రాంతులకు గురిచేసింది.
చాకచక్యంగా..
అనంతరం చెట్ల పొదల్లో దాక్కున్న ఎలుగును గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చాకచక్యంగా వ్యవహరించిన ఫారెస్ట్ అధికారులు ఆ ఎలుగును అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చేశారు.
ఇవీ చూడండి: ఎమ్మిగనూరులో పకడ్బందీగా కర్ఫ్యూ