కర్నూలు జిల్లా
మిడుతూరులో వైకాపా నాయకులు కూరగాయలు, పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి వైకాపా నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 150 చొప్పున రూ. 2,40,000 విలువైన కూరగాయలను పంపిణీ చేశారు. వీటన్నింటిని ఆటోలో నింపి వాలంటీర్లకు అప్పగించి ఇంటింటికీ అందించారు.
ప్రకాశం జిల్లా
పుల్లల చెరువు మండలం నాయుడుపాలెంలో అలెటి జాన్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయలను పంపిణీ చేశారు. పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు.
అనంతపురం జిల్లా
ధర్మవరంలో ఆదిగురు యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పట్టణంలోని రాజేంద్రనగర్లో 250 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులు వినూత్నంగా అందించారు. సరుకులను తీసుకెళ్లేందుకు వచ్చిన కార్మికులనకు నిర్వహకులే కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారాలు చేశారు. ఇకపై ఇదే విధానాన్ని పాటిస్తామని ఆదిగురు యోగా కేంద్రం ప్రతినిధి నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి :