కర్నూలు జిల్లా నంద్యాలలోని పలు బార్ అండ్ రెస్టారెంట్లలో.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటి పరిసరాలు, వంటశాల, పాత్రలు, నిల్వ ఆహారాన్ని పరిశీలించారు. నిబంధనలు పాటించని రాజధాని, చందమామ బార్ అండ్ రెస్టారెంట్లకు.. యాభై వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. విజిలెన్స్ సీఐ నాగరాజ్ యాదవ్, ఎస్సై జయన్నతో పాటు పురపాలక సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
నల్లమల ఘాట్ రోడ్డులో 6 గంటలు ట్రాఫిక్ జాం.. చక్కదిద్దిన పోలీసులు