ETV Bharat / state

పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. దుర్గంధభరితంగా వ్యవసాయ మార్కెట్ - అపరిశుభ్రంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్

అది జిల్లా కేంద్రంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్. నిత్యం వేలాది మంది రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు క్రయవిక్రయాలు చేస్తుంటారు. ఇంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుంటుంది. పందులు, కుక్కలు, ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. చినుకు పడితే చిత్తడిగా మారుతుంటుంది. అయినా ఎవరూ పట్టించుకోరు. కర్నూలులోని వ్యవసాయ మార్కెట్ దుస్థితి ఇది.

vegetable market stinky in kurnol
పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. దుర్గంధభరితంగా వ్యవసాయ మార్కెట్
author img

By

Published : Oct 24, 2020, 5:16 PM IST

కర్నూలు నగరం నడిబొడ్డున కొత్త బస్టాండ్ సమీపంలో వ్యవసాయ మార్కెట్ ఉంది. ఇక్కడికి కూరగాయలు, ఉల్లి గడ్డలు, ధాన్యం అమ్ముకోవటానికి రోజూ ఎంతోమంది రైతులు వస్తుంటారు. కూరగాయల మార్కెట్​లో నగరవాసులు, హోటల్ యజమానులు, కూరగాయల వ్యాపారులు శుభకార్యాల కోసం ఇక్కడే కాయగూరలు కొనుగోలు చేస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్కెట్​లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఎటు చూసినా చెత్తతో నిండిపోయి కనిపిస్తోంది. పందులు, ఆవులు, కుక్కల సంచారంతో అధ్వానంగా ఉంది.

వర్షం పడితే చిత్తడే

సాధారణ రోజుల్లోనే మార్కెట్​కు వెళ్లటానికి ఇబ్బందిపడాల్సి వస్తోంది. అదే వర్షాకాలంలో అయితే చిత్తడి చిత్తడిగా ఉంటుంది. కొద్దిపాటి వర్షం పడినా... బురదమయంగా మారుతుంది. మురుగువాసనతో ముక్కుపుటాలు అదిరిపోతాయి. కనీసం కొద్దిసేపు నిలబడటానికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో నగర ప్రజలు అక్కడే కూరగాయలు కొనుగోలు చేస్తుండగా... వ్యాపారులు బురదలోనే అమ్ముతున్నారు. ఎవరూ పట్టించుకోవటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

కూరగాయల మార్కెట్​ ఆనుకునే ఉల్లిపాయల మార్కెట్ ఉంటుంది. అక్కడే మార్కెట్ సెక్రటరీ, జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ, ఇంజినీరింగ్ కార్యాలయం ఉన్నాయి. అధికారులు ఇదే మార్గం నుంచి వచ్చిపోతుంటారు. అయినా... ఈ దుస్థితిపై ఎవరూ దృష్టిసారించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి..

పంచలింగాల చెక్ పోస్టు వద్ద అక్రమ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.