కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని వడ్డుగండ్ల చెరువు నుంచి నీరు వృథాగా బయటకు పోతోంది. కొందరు చేపల కోసమే చెరువు నుంచి విచ్ఛలవిడిగా నీటిని బయటకు పంపుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నీటి పారుదలశాఖ నాగన్నను వివరణ కోరగా చేపలు పట్టుకోవడానికి చెరువులో ఉన్న నీరు వృథాగా బయటకు పంపేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఎవరైనా అలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువులో సగానికి పైగా నీరు ఉంటే, రెండు రోజుల నుంచి నీటిని బయటికి వదిలేయడం నీటిమట్టం తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు. నీరు నిల్వ ఉంటేనే పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోకుండా ఉంటాయని అంటున్నారు. ఇలా వృథాగా నీరు పోతున్న కారణంగా.. సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: