Union Minister V Muraleedharan fiers on cm jagan: జగన్మోహన్‌రెడ్డి అవినీతి పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారని.. కేంద్రమంత్రి మురళీధరన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన భాజపా నేత శ్రీకాంత్‌రెడ్డిని... రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి మురళీధరన్ పరామర్శించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలేసి, అలాంటి వాటిని అడ్డుకోబోయిన శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు.
"భాజపా నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి. శ్రీకాంత్‌ను చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారు. భాజపా నేతలను ఆత్మకూరుకు పంపాలి. అల్లర్లు జరిగిన రోజు నుంచి భాజపా నేతలను అక్కడికి పంపలేదు. జగన్ అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పాలనపై సీఎం దృష్టి పెట్టకపోవడంతో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారు.. సీఎం బాధ్యత వహించాలి" - మురళీధరన్, కేంద్రమంత్రి
ఇదీ చదవండి